logo

ఓట్ల లెక్కింపునకు పక్కా ఏర్పాట్లు

సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు పకడ్బందీగా ఏర్పాటు చేపట్టాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి ఆర్వోలకు సూచించారు.

Published : 17 May 2024 04:46 IST

మాట్లాడుతున్న కలెక్టర్‌ వేణుగోపాల్‌రెడ్డి, పక్కన జేసీ రాజకుమారి, కమిషనర్‌ కీర్తి

కలెక్టరేట్‌(గుంటూరు), న్యూస్‌టుడే: సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు పకడ్బందీగా ఏర్పాటు చేపట్టాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి ఆర్వోలకు సూచించారు. కలెక్టరేట్‌లోని ఆయన ఛాంబర్‌లో గురువారం రిటర్నింగ్‌ అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా కేటాయించిన భవనాల్లో కౌంటింగ్‌కు టేబుళ్లు, బారికేడ్లు, సీసీ కెమెరాలు తదితర సౌకర్యాలను ఆర్వోలు పరిశీలించి పూర్తి చేయాలన్నారు. ఈసీ మార్గదర్శకాల ప్రకారం లెక్కింపు సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలు, ర్యాండమైజేషన్‌ ప్రక్రియలను సక్రమంగా నిర్వహించాలన్నారు. కౌంటింగ్‌ రోజు టేబుళ్లు, రౌండ్ల వారీగా వివరాలు జిల్లా ఎన్నికల అధికారికి, రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఎప్పటికప్పుడు అందించేలా అవసరమైన సిబ్బందిని నియమించుకోవాలన్నారు. కంప్యూటర్లు, అంతర్జాలం తదితర సదుపాయాలను ముందుగానే చూసుకోవాలన్నారు. సమావేశంలో జిల్లా సంయుక్త కలెక్టర్‌ జి.రాజకుమారి, తెనాలి సబ్‌ కలెక్టర్‌ ప్రఖార్‌ జైన్‌, నగర కమిషనర్‌ కీర్తి చేకూరి, ఆర్డీవో శ్రీకర్‌, ప్రత్యేక ఉప కలెక్టర్లు గంగరాజు, లక్ష్మీకుమారి, నగరపాలక సంస్థ అదనపు కమిషనర్‌ కె.రాజ్యలక్ష్మీ, శిక్షణ కలెక్టర్‌ పవార్‌ స్వప్నిల్‌ జగన్నాథ్‌, డిప్యూటీ కలెక్టర్‌ కె.స్వాతి పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని