logo

యువకుల ప్రాణాలు కాపాడిన బీచ్‌ పోలీసులు

 సూర్యలంక తీరంలో విహారానికి వచ్చి సముద్ర స్నానం చేస్తూ ప్రమాదవశాత్తు నీటిలో కొట్టుకుపోతున్న మంగళగిరికి చెందిన ఇద్దరు యువకుల ప్రాణాలను బీచ్‌ పోలీసులు బుధవారం కాపాడారు.

Published : 02 May 2024 06:35 IST

ప్రమాదం నుంచి బయటపడ్డ యువకులు భానుప్రకాష్‌, కిరణ్‌బాబుతో బీచ్‌ పోలీసులు

బాపట్ల, న్యూస్‌టుడే:  సూర్యలంక తీరంలో విహారానికి వచ్చి సముద్ర స్నానం చేస్తూ ప్రమాదవశాత్తు నీటిలో కొట్టుకుపోతున్న మంగళగిరికి చెందిన ఇద్దరు యువకుల ప్రాణాలను బీచ్‌ పోలీసులు బుధవారం కాపాడారు. మంగళగిరికి చెందిన వేశం భానుప్రకాష్‌, గాలి కిరణ్‌బాబు స్నేహితులతో కలిసి సూర్యలంక సముద్ర తీరానికి వచ్చారు. సముద్ర స్నానం చేస్తూ ఎక్కువ లోతుకు వెళ్లిన వారు అలల ఉద్ధృతికి కొట్టుకుపోతూ రక్షించమని కేకలు వేశారు. విధుల్లో ఉన్న బీచ్‌ పోలీసు సిబ్బంది, గజ ఈతగాళ్లు వెంటనే స్పందించి సముద్రంలోకి ఈదుకుంటూ వెళ్లి యువకుల ప్రాణాలు కాపాడి సురక్షితంగా ఒడ్డుకు చేర్చి ప్రాథమిక చికిత్స చేశారు. తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా సముద్రంలోకి వెళ్లి యువకుల ప్రాణాలు కాపాడిన పోలీసు సిబ్బంది నాగరాజు, నరసింహమూర్తి, శ్రీనివాసరావు, నాగరాజు, గజ ఈతగాళ్లు సత్యనారాయణ, నాగేశ్వరరావు, ఆంజనేయులు, శివకోటేశ్వరరావును ఎస్పీ వకుల్‌ జిందాల్‌ అభినందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు