logo

సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల్లో పటిష్ఠ బందోబస్తు

ఓటుహక్కు కలిగిన ప్రతి ఒక్కరూ తప్పని సరిగా ఎన్నికల్లో ఓటేయాలని కలెక్టర్‌ రంజిత్‌బాషా సూచించారు. రేపల్లె మండలం పేటేరు ప్రాథమిక, ఉన్నత పాఠశాలలోని పోలింగ్‌ కేంద్రాలను మంగళవారం సందర్శించారు.

Published : 08 May 2024 06:04 IST

పేటేరులోని పోలింగ్‌ కేంద్రాన్ని పరిశీలించి వస్తున్న కలెక్టర్‌ రంజిత్‌బాషా, ఆర్వో హెలాషారోన్‌

రేపల్లె అర్బన్‌: ఓటుహక్కు కలిగిన ప్రతి ఒక్కరూ తప్పని సరిగా ఎన్నికల్లో ఓటేయాలని కలెక్టర్‌ రంజిత్‌బాషా సూచించారు. రేపల్లె మండలం పేటేరు ప్రాథమిక, ఉన్నత పాఠశాలలోని పోలింగ్‌ కేంద్రాలను మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల్లో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతి పౌరుడు స్వేచ్ఛగా, నిర్భయంగా తమ ఓటుహక్కు వినియోగించుకునేందుకు ప్రశాంత వాతావరణం కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈనెల 13న జరిగే ఎన్నికల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలిచ్చారు. తొలుత అనగాని భగవంతరావు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈవీఎంలను భద్రపర్చిన స్ట్రాంగ్‌ రూం, స్థానిక రెవెన్యూ డివిజన్‌ కార్యాలయంలో పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ తీరును పరిశీలించారు. రిటర్నింగ్‌ అధికారి, ఆర్డీవో హెలాషారోన్‌, తహసీల్దారు రవీంద్రబాబు, ఎస్సై హరిబాబు, వీఆర్వో సర్దార్‌ తదితరులు వెంట ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు