logo

పరిశీలకులకు ఎన్నికల వ్యయం అభ్యర్థనలు, ఫిర్యాదులు

జిల్లాలో సార్వత్రిక ఎన్నికల్లో పోటీలో ఉన్న అభ్యర్థుల ఎన్నికల వ్యయాన్ని పరిశీలించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ముగ్గురు వ్యయ పరిశీలకులను జిల్లాకు కేటాయించిందని కలెక్టరు ఎం.వేణుగోపాల్‌రెడ్డి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు.

Published : 08 May 2024 06:07 IST

జిల్లాపరిషత్తు (గుంటూరు), న్యూస్‌టుడే: జిల్లాలో సార్వత్రిక ఎన్నికల్లో పోటీలో ఉన్న అభ్యర్థుల ఎన్నికల వ్యయాన్ని పరిశీలించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ముగ్గురు వ్యయ పరిశీలకులను జిల్లాకు కేటాయించిందని కలెక్టరు ఎం.వేణుగోపాల్‌రెడ్డి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. నియోజకవర్గాల వ్యయ పరిశీలకులు మృణాల్‌ కుమార్‌దాస్‌(గుంటూరు పార్లమెంట్‌), రాధానాథ్‌ పురోహిత్‌(తాడికొండ, మంగళగిరి, పొన్నూరు, తెనాలి), యెర్నె వినోద్‌కుమార్‌(ప్రత్తిపాడు, గుంటూరు తూర్పు, గుంటూరు పశ్చిమ)లు అభ్యర్థుల వ్యయాన్ని పరిశీలిస్తారన్నారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు వ్యయాలకు సంబంధించి ఎలాంటి అభ్యర్థనలు, ఫిర్యాదులు ఉంటే ఫోన్‌ నంబర్‌లో గాని, గుంటూరులోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో నేరుగా గాని కలిసి తెలియజేయవచ్చన్నారు. మృణాల్‌ కుమార్‌దాస్‌: 91548 82126, రాధానాథ్‌ పురోహిత్‌: 91548 82131, యెర్నె వినోద్‌కుమార్‌: 91548 82129 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు