logo

మంగళగిరి అభివృద్ధికి లోకేశ్‌కు ఓటేయండి

పేదరికం లేని మంగళగిరి నియోజకవర్గ సాధన కోసం నారా లోకేశ్‌కు ఓటు వేయాలని ఆయన కుటుంబ సభ్యులు మంగళవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మంగళగిరి శ్రీలక్ష్మీనృసింహస్వామి గాలి గోపురం నుంచి ప్రచారాన్ని ప్రారంభించారు.

Published : 08 May 2024 06:09 IST

ఇంటింటి ప్రచారంలో కుటుంబ సభ్యులు

లక్ష్మీనరసింహస్వామికి పండ్లు, ఫలహారాలు తీసుకెళ్తున్న లోకేశ్‌ కుటుంబ సభ్యులు

మంగళగిరి, తాడేపల్లి: పేదరికం లేని మంగళగిరి నియోజకవర్గ సాధన కోసం నారా లోకేశ్‌కు ఓటు వేయాలని ఆయన కుటుంబ సభ్యులు మంగళవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మంగళగిరి శ్రీలక్ష్మీనృసింహస్వామి గాలి గోపురం నుంచి ప్రచారాన్ని ప్రారంభించారు. తొలుత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

10, 11 వార్డుల్లో పర్యటిస్తూ కూటమి మ్యానిఫేస్టో, సూపర్‌-6 పథకాలు, బీసీ డిక్లరేషన్‌కు సంబంధించిన కరపత్రాలు పంపిణీ చేశారు. కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి లోకేశ్‌, ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్‌లను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. చంద్రబాబు సీఎం అయితేనే రాష్ట్రానికి భవిష్యత్తు ఉంటుందన్నారు. మూడు రాజధానులు పేరుతో అమరావతిని సర్వనాశనం చేశారని, వైకాపా ఐదేళ్ల పాలనలో విధ్వంసం తప్ప అభివృద్ధి లేదని వివరించారు. గారపాటి లోకేశ్వరి, ఎన్టీఆర్‌ మనువడు నందమూరి మాధవిమణి, గారపాటి శ్రీనివాస్‌, కంఠమనేని శ్రీనివాసప్రసాద్‌ పాల్గొన్నారు.

ఇంటి వద్దకే రూ.4 వేల పింఛన్‌..

తెదేపా, జనసేన, భాజపా కూటమి ప్రభుత్వంలో పింఛన్‌ రూ.4 వేలు ఇంటి వద్దకే అందిస్తారని లోకేశ్‌ కుటుంబ సభ్యులు ప్రజలకు వివరించారు. దివ్యాంగులకు రూ.6 వేలు, కిడ్నీ, తలసీమియా తదితర దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులకు రూ.10 వేలు పింఛన్‌ ఇస్తారని చెప్పారు. ప్రతి కుటుంబానికీ ఉచితంగా మూడు గ్యాస్‌ సిలిండర్లు అందిస్తారని చెప్పారు. 10 నుంచి 59 ఏళ్ల మధ్య ఉన్న ప్రతి మహిళకు నెలకు రూ.1500, బడికి వెళ్లే విద్యార్థికి ఏడాదికి రూ.15 వేలు సాయం అందించి అండగా నిలుస్తారని భరోసా ఇచ్చారు.

లోకేశ్‌కు ఓటు వేయాలని స్థానిక మహిళను కోరుతూ..

ప్రజల కోసమే కూటమి ఆవిర్భావం 

ప్రజలకు మేలు చేసేందుకు జనసేన, భాజపాతో తెదేపా కూటమిగా ఏర్పడిందని గారపాటి శ్రీనివాస్‌ తెలిపారు. ఇంటింటా ప్రచారంలో భాగంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు లోకేశ్‌ లక్ష్యంగా పెట్టుకున్నారని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు