logo

Trains: నేటి నుంచి ప్యాసింజర్‌ రైళ్ల రాకపోకలు

తొలి దశ కరోనా వ్యాప్తి నేపథ్యంలో గత ఏడాది విధించిన లాక్‌డౌన్‌తో ప్యాసింజర్‌ (అన్‌ రిజర్వ్‌డ్‌ ఎక్స్‌ప్రెస్‌) రైళ్ల రాకపోకలు నిలిచి పోయాయి. వైరస్‌ తగ్గుముఖం పట్టడంతో మధ్యలో ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను మాత్రమే నడపటం ప్రారంభించారు. తాజాగా ప్యాసింజర్‌ రైళ్లను జులై

Updated : 19 Jul 2021 07:46 IST

తాండూరు టౌన్‌ (న్యూస్‌టుడే): తొలి దశ కరోనా వ్యాప్తి నేపథ్యంలో గత ఏడాది విధించిన లాక్‌డౌన్‌తో ప్యాసింజర్‌ (అన్‌ రిజర్వ్‌డ్‌ ఎక్స్‌ప్రెస్‌) రైళ్ల రాకపోకలు నిలిచి పోయాయి. వైరస్‌ తగ్గుముఖం పట్టడంతో మధ్యలో ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను మాత్రమే నడపటం ప్రారంభించారు. తాజాగా ప్యాసింజర్‌ రైళ్లను జులై 19 నుంచి నడపటానికి రైల్వే శాఖ నిర్ణయించింది. దీనికి అనుగుణంగా పదహారు నెలల తర్వాత ఫలక్‌నుమా నుంచి సికింద్రాబాద్‌ నుంచి వాడీ దాకా రాకపోకలు సాగనున్నాయి. ఫలక్‌నుమా నుంచి వాడీ వెళ్లే రైలు తాండూరుకు ఉదయం 8.50 గంటలకు వస్తుంది. సికింద్రాబాద్‌ నుంచి కలుబురిగి వెళ్లే రైలు ఉదయం 5.58 గంటలకు చేరుకుంటుంది. ఇన్నాళ్లూ ప్యాసింజర్‌ రైళ్లు తిరగనందున తాండూరు నుంచి హైదరాబాద్‌కు వెళ్లేందుకు ప్రయాణికులు, సామాన్యులు నానా అవస్థలు పడ్డారు. ఎంతో మంది ఉద్యోగులు, విద్యార్థులు, ఉపాధి కోసం యువత, కూలీలు హైదరాబాద్‌, వికారాబాద్‌, శంకర్‌పల్లి, సేడం, గుల్బర్గా వంటి ప్రాంతాలకు వెళ్లటానికి ప్రైవేటు వాహనాలను ఆశ్రయించి అధికంగా ఛార్జీలు చెల్లించాల్సి వచ్చింది. సోమవారం నుంచి ప్యాసింజర్‌ రైళ్లు అందుబాటులోకి వస్తుండటంతో వీరంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని