logo

తీరొక్క బొమ్మ.. తీర్చిదిద్దితినమ్మా

సంక్రాంతిని పురస్కరించుకొని ఆనంద్‌ నగర్‌ కాలనీలోని ఓ కుటుంబం ఏటా బొమ్మల కొలువు ఏర్పాటు చేస్తుంది. ఈసారి సుమారు 3,500 రకాల బొమ్మలతో ఏర్పాటు చేసిన ఈ కొలువు ఆకట్టుకొంటోంది. పూర్వీకుల నుంచి వస్తున్న ఆనవాయితీ మేరకు

Published : 15 Jan 2022 01:43 IST

సంక్రాంతిని పురస్కరించుకొని ఆనంద్‌ నగర్‌ కాలనీలోని ఓ కుటుంబం ఏటా బొమ్మల కొలువు ఏర్పాటు చేస్తుంది. ఈసారి సుమారు 3,500 రకాల బొమ్మలతో ఏర్పాటు చేసిన ఈ కొలువు ఆకట్టుకొంటోంది. పూర్వీకుల నుంచి వస్తున్న ఆనవాయితీ మేరకు ఏటా ఈ వేడుక నిర్వహిస్తున్నామని బీఎస్‌యన్‌ మూర్తి, పద్మ దంపతులు తెలిపారు. 15 రోజుల పాటు ప్రదర్శన ఉంటుందని, నిత్యం ప్రత్యేక పూజలు చేస్తామని వివరించారు. దశావతార మూర్తులతో పాటు విఘ్నేశ్వరుడు, శ్రీకృష్ణుడు, శివ పార్వతులు, కలియుగ వేంకటేశ్వరుడు తదితర దేవతామూర్తులను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఏటా సుమారు 300 మందిని పిలిచి అన్నదానం చేసేవారమని, ప్రస్తుతం కరోనా నేపథ్యంలో కుటుంబ సభ్యులతోనే పండగ చేసుకుంటున్నామని పేర్కొన్నారు. 

- న్యూస్‌టుడే, పంజాగుట్ట

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని