Revanth: టీచర్లు లేకుండా ఆంగ్ల విద్య ఎలా అందిస్తారు?: రేవంత్‌

పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం విషయంలో సీఎం కేసీఆర్‌ ప్రజలను

Updated : 18 Jan 2022 14:16 IST

హైదరాబాద్‌: పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం విషయంలో సీఎం కేసీఆర్‌ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ఆరోపించారు.  టీచర్లు లేకుండా ఆంగ్ల విద్య ఎలా అందిస్తారని ప్రశ్నించారు. పేదలకు విద్యను దూరం చేసేందుకు కంకణం కట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యాహక్కు చట్టం అమలును సీఎం పట్టించుకోవట్లేదని మండిపడ్డారు. డీఎస్సీ నోటిఫికేషన్‌ను కేసీఆర్‌ ఎందుకు ఇవ్వట్లేదు అని రేవంత్‌ నిలదీశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని