logo

రూ.2.50 లక్షల తంబాకు పట్టివేత

కర్ణాటక నుంచి రాష్ట్రంలోకి అక్రమంగా తరలిస్తున్న నిషేధిత తంబాకును జహీరాబాద్‌ మండలం చిరాగ్‌పల్లి పోలీసులు శనివారం పట్టుకున్నారు. స్థానిక ఎస్‌ఐ ఎం.కాశీనాథ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. సరిహద్దులో వాహనాలు తనిఖీ చేస్తుండగా

Published : 23 Jan 2022 00:45 IST

పట్టుబడిన వాహనం

జహీరాబాద్‌: కర్ణాటక నుంచి రాష్ట్రంలోకి అక్రమంగా తరలిస్తున్న నిషేధిత తంబాకును జహీరాబాద్‌ మండలం చిరాగ్‌పల్లి పోలీసులు శనివారం పట్టుకున్నారు. స్థానిక ఎస్‌ఐ ఎం.కాశీనాథ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. సరిహద్దులో వాహనాలు తనిఖీ చేస్తుండగా కర్ణాటకలోని బాల్కి వైపు నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న ఓ వాహనంలో మన రాష్ట్ర ప్రభుత్వం నిషేధించిన బ్లూబుల్‌ తొబాకో రూ.2.50లక్షల విలువ గల 40 బస్తాలు లభించినట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని బస్తాలను స్వాధీనం చేసుకోవటంతో పాటు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు ఆయన తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని