logo

సెప్టిక్‌ ట్యాంకు శుభ్రం చేస్తూ ఒకరి మృతి

సెప్టిక్‌ ట్యాంకు శుభ్రం చేసేందుకు వచ్చి ఓ వ్యక్తి మృతి చెందగా ముగ్గురు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన పటాన్‌చెరు ఠాణా పరిధిలో జరిగింది. ఎస్సై రామునాయుడు తెలిపిన ప్రకారం..

Published : 20 May 2022 02:49 IST


సుధాకర్‌

పటాన్‌చెరు అర్బన్‌, న్యూస్‌టుడే: సెప్టిక్‌ ట్యాంకు శుభ్రం చేసేందుకు వచ్చి ఓ వ్యక్తి మృతి చెందగా ముగ్గురు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన పటాన్‌చెరు ఠాణా పరిధిలో జరిగింది. ఎస్సై రామునాయుడు తెలిపిన ప్రకారం.. పటాన్‌చెరు మండలం ఇస్నాపూర్‌లో ఉన్న కాకతీయ ఆసుపత్రి భవనంలో సెప్టిక్‌ ట్యాంక్‌ నిండటంతో భవన యజమాని రవీందర్‌ జస్ట్‌ డయల్‌ ద్వారా ఇచ్చిన నంబర్లకు ఫోన్‌ చేశాడు. నల్గొండ జిల్లా చందంపేట గ్రామం చిదిరియాల తండాకు చెందిన సుధాకర్‌ (25).. నందు, చందర్‌, ప్రవీణ్‌లతో సహా వచ్చాడు. అంతా శుభ్రం చేశాక నలుగురూ సెప్టిక్‌ ట్యాంకు లోపలకు దిగారు. అక్కడ విష వాయువులు వెలువడటంతో సుధాకర్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. నందు, చందర్‌, ప్రవీణ్‌లు ముగ్గురూ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని