logo

ఓయూలో 26 మందికి సీనియర్‌ ఆచార్యులుగా పదోన్నతి

ఉస్మానియా విశ్వవిద్యాలయంలో 26 మందికి సీనియర్‌ ఆచార్యులుగా పదోన్నతి కల్పిస్తూ వర్సిటీ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. పదేళ్ల సీనియారిటీ, పరిశోధన అనుభవం ఆధారంగా పదోన్నతి కల్పిస్తూ పాలక మండలి

Published : 25 May 2022 04:32 IST

ఉస్మానియా యూనివర్సిటీ: ఉస్మానియా విశ్వవిద్యాలయంలో 26 మందికి సీనియర్‌ ఆచార్యులుగా పదోన్నతి కల్పిస్తూ వర్సిటీ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. పదేళ్ల సీనియారిటీ, పరిశోధన అనుభవం ఆధారంగా పదోన్నతి కల్పిస్తూ పాలక మండలి ఆమోదం తెలిపింది. వారికి ఓయూ వీసీ ప్రొ.రవీందర్‌ ధ్రువపత్రాలు అందజేశారు. పదోన్నతి సాధించినవారిలో ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ప్రొ.లింబాద్రి, పాలమూరు విశ్వవిద్యాలయ వీసీ ప్రొ.లక్ష్మికాంత్‌ రాథోడ్‌, ఇఫ్లూ వీసీ ప్రొ.ఇ.సురేష్‌కుమార్‌, ఓయూ రిజిస్ట్రార్‌ ప్రొ.లక్ష్మినారాయణ ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని