logo

3 వేల మంది తలసీమియా బాధితులకు ఉచిత విద్య

తలసీమియా అండ్‌ సికిల్‌సెల్‌ సొసైటీ(టీఎస్‌సీఎస్‌)లో నమోదైన 3,085 మంది చిన్నారులకు ఉచిత విద్య అందిస్తామని ఎంఎస్‌ ఎడ్యుకేషన్‌ అకాడమీ ఛైర్మన్‌ మహ్మద్‌ లతీఫ్‌ ఖాన్‌ ప్రకటించారు.

Published : 27 May 2022 03:53 IST

ఈనాడు- హైదరాబాద్‌: తలసీమియా అండ్‌ సికిల్‌సెల్‌ సొసైటీ(టీఎస్‌సీఎస్‌)లో నమోదైన 3,085 మంది చిన్నారులకు ఉచిత విద్య అందిస్తామని ఎంఎస్‌ ఎడ్యుకేషన్‌ అకాడమీ ఛైర్మన్‌ మహ్మద్‌ లతీఫ్‌ ఖాన్‌ ప్రకటించారు. తలసీమియాతో బాధపడే విద్యార్థులకు మంచి భవిష్యత్తు అందించాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఓ ప్రకటనలో తెలిపారు. రాజేంద్రనగర్‌లోని టీఎస్‌సీఎస్‌ కేంద్రాన్ని గురువారం ఆయన సందర్శించారు. టీఎస్‌సీఎస్‌ అధ్యక్షుడు చంద్రశేఖర్‌, కార్యదర్శి సుమన్‌ జైన్‌, సంయుక్త కార్యదర్శి అలీం బేగ్‌ మాట్లాడారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని