logo

న్యాయ పోరాటంలో బడుగులకు బాసట

న్యాయానికి ధనిక, పేద అనే భేదాలు లేవు. అందరికీ సమాన అవకాశాలు కల్పించడానికి, ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులతో ఏ వ్యక్తీ న్యాయాన్ని పొందే అవకాశాలను కోల్పోకూడదన్న లక్ష్యంతో తీసుకొచ్చిన లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ చట్టం బడుగుల జీవితాల్లో

Published : 27 Jun 2022 02:43 IST

ఉచితంగా సేవలందిస్తున్న ‘లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ’

- ఈనాడు, హైదరాబాద్‌

న్యాయానికి ధనిక, పేద అనే భేదాలు లేవు. అందరికీ సమాన అవకాశాలు కల్పించడానికి, ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులతో ఏ వ్యక్తీ న్యాయాన్ని పొందే అవకాశాలను కోల్పోకూడదన్న లక్ష్యంతో తీసుకొచ్చిన లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ చట్టం బడుగుల జీవితాల్లో వెలుగులు నింపుతోంది. క్రిమినల్‌ కేసులు, అన్యాక్రాంత వినిమయ చట్టం, విచారణ ఖైదీలకు సంబంధిత న్యాయ సహాయాన్ని మెట్రోపాలిటన్‌ లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ అందిస్తోంది. ఉచిత న్యాయసేవలు పొందడమెలా? ఇందుకోసం ఎవర్ని సంప్రదించాలి..? అనే విషయాలు తెలియక కొంతమంది న్యాయపోరాటంలో ఓడిపోతున్నారు. వీరికి బాసటగా నిలుస్తోంది లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ.

తెల్ల కాగితంపై దరఖాస్తు!
ఆర్థిక స్తోమత లేదని, లాయర్ని ఏర్పాటు చేసుకోలేమని, కోర్టు ఫీజు కట్టలేమంటూ కాగితం మీద రాసిన అర్జీని పురానీహవేలీ సిటీ సివిల్‌ కోర్టులోని న్యాయసేవాసదన్‌లో అందిస్తే పరిశీలించి, ఆర్థికస్థితిగతులను విచారించాక ప్యానల్‌ లాయర్‌ను నియమిస్తారు.

ఎలాంటి కేసులు?
మాట్రిమోనియల్‌, ఆస్తి వివాదాలు, కార్మికులు, రుణాలు, చెక్‌బౌన్స్‌లు, ప్రాంసరీనోటు కేసులు, నిరాదరణకు గురైన తల్లిదండ్రులను ముందస్తు విచారణ చేసి ఇరుపక్షాల మధ్య సయోధ్య కుదిర్చే ప్రయత్నం చేయడంతో పాటు బాధితులకు నష్టపరిహారం అందజేస్తున్నారు.

అవసరమైతే కోర్టు ఫీజు కూడా..
ఆమ్లదాడి బాధితులు, ఆర్థికంగా వెనకబడిన వారు, ఎస్సీలు, ఎస్టీలు, వికలాంగులు, మానవ అక్రమ రవాణా బాధితులు, మతిస్థిమితం లేనివారు, పారిశ్రామిక విపత్తుల్లో చిక్కుకున్నవారు, సీనియర్‌ సిటిజన్లు, బాలనేరస్థులకు న్యాయపరమైన హక్కులు పొందేలా ఉచిత న్యాయసేవలు అందిస్తున్నారు. అవసరమైతే కోర్టు ఫీజు నుంచి మినహాయింపు కల్పిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని