logo

ఇద్దరు యువకుల అఘాయిత్యం.. గర్భం దాల్చిన బాలిక

ప్రేమ పేరుతో మాయ మాటలు చెప్పి బాలికను గర్భవతిని చేసిన ఘటన చేవెళ్ల పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. చేవెళ్ల పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన బాలిక(16) ఇంటర్‌ చదువుకొని ఇంటి వద్ద ఉంటోంది.

Published : 04 Jul 2022 03:57 IST

చేవెళ్ల గ్రామీణం: ప్రేమ పేరుతో మాయ మాటలు చెప్పి బాలికను గర్భవతిని చేసిన ఘటన చేవెళ్ల పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. చేవెళ్ల పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన బాలిక(16) ఇంటర్‌ చదువుకొని ఇంటి వద్ద ఉంటోంది. అదే గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు ఆమెతో స్నేహంగా ఉండేవారు. ఒకరు ప్రేమ పేరుతో శారీరకంగా లోబరుచుకున్నాడు. స్నేహంగా ఉండే మరో యువకుడు మాయమాటలు చెప్పి బాలికతో శారీరక సంబంధం పెట్టుకున్నాడు. కడుపు నొప్పిగా ఉందని బాలిక తల్లిదండ్రులకు చెప్పడంతో ఆసుపత్రికి తీసుకెళ్లారు. గర్భిణి అని తెలియడంతో నిలదీశారు. స్నేహం, ప్రేమ పేరుతో ఇద్దరు యువకులు లోబరుచుకున్న విషయాన్ని బయటపెట్టింది. బాధితులు పోలీసులను ఆశ్రయించగా, కేసు నమోదు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని