logo

ఎక్సైజ్‌ శాఖలో ఉద్యోగాలంటూ మోసం

ఎక్సైజ్‌ శాఖలో స్టోర్‌ ఆఫీసర్‌, స్టోర్‌ అసిస్టెంట్‌ పేరిట ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగులను మోసం చేసిన ఘటన నగరంలో చోటు చేసుకుంది. ఈ మేరకు నర్సింహస్వామి అనే వ్యక్తితోపాటు మరో

Published : 05 Jul 2022 01:21 IST

ఈనాడు, హైదరాబాద్‌: ఎక్సైజ్‌ శాఖలో స్టోర్‌ ఆఫీసర్‌, స్టోర్‌ అసిస్టెంట్‌ పేరిట ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగులను మోసం చేసిన ఘటన నగరంలో చోటు చేసుకుంది. ఈ మేరకు నర్సింహస్వామి అనే వ్యక్తితోపాటు మరో 9 మంది సోమవారం నగర సీసీఎస్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.. ఎక్సైజ్‌ అండ్‌ ప్రొహిబిషన్‌ శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తానని సికింద్రాబాద్‌కు చెందిన శ్రీనివాస్‌గౌడ్‌ అనే వ్యక్తి కొందరు నిరుద్యోగుల నుంచి రూ.లక్షల్లో వసూలు చేశాడు. ఎంతకూ ఉద్యోగాలు రాకపోవడంతో కొందరు బాధితులు డబ్బులు వెనక్కి ఇవ్వాలని ఒత్తిడి తేవడంతో ఇవ్వకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు. చివరికి గత ఏప్రిల్‌లో బాధితులకు చెక్కులు ఇచ్చాడు. అవి బ్యాంకులో చెల్లకపోవడంతో మోసపోయామని గ్రహించిన పది మంది బాధితులు సీసీఎస్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇలా మోసపోయిన బాధితులు మరింత మంది ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని