logo

ఇంటి చెంతనే జ్వర పరీక్షలు

గ్రేటర్‌ వ్యాప్తంగా డెంగీ కేసులు నమోదవుతున్న దృష్ట్యా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య ఆరోగ్యశాఖ సూచిస్తోంది. 3-4 నాలుగు రోజులు దాటినా జ్వరం తగ్గకపోవడం, తీవ్ర నీరసం,...

Published : 06 Aug 2022 02:56 IST

ఈనాడు, హైదరాబాద్‌: గ్రేటర్‌ వ్యాప్తంగా డెంగీ కేసులు నమోదవుతున్న దృష్ట్యా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య ఆరోగ్యశాఖ సూచిస్తోంది. 3-4 నాలుగు రోజులు దాటినా జ్వరం తగ్గకపోవడం, తీవ్ర నీరసం, తలనొప్పి, కళ్ల నొప్పి లాంటి లక్షణాలు కన్పిస్తే వెంటనే అప్రమత్తం కావాలని చెబుతోంది. డెంగీ గుర్తింపులో పరీక్షలే కీలకమని స్పష్టం చేస్తోంది. గ్రేటర్‌లో 189 పట్టణ ఆరోగ్య కేంద్రాలు, 150 బస్తీ దవాఖానాల్లో డెంగీ పరీక్షలు చేస్తున్నారు. అవగాహన లేక చాలామంది ప్రైవేటు డయాగ్నోస్టిక్‌ కేంద్రాలను ఆశ్రయిస్తున్నారు.

ఏం చేయాలంటే...

* బస్తీ దవాఖానాలు, పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఓపీ సేవలుంటాయి. * డెంగీ రోగుల్లో ప్లేట్‌లెట్ల సంఖ్య కోసం కంప్లీట్‌ బ్లడ్‌ పరీక్షలు(సీబీపీ) చేస్తారు. అత్యవసర చికిత్సలు అవసరమైనవారిని ఫీవర్‌ ఆసుపత్రి లేదా గాంధీ, ఉస్మానియాకు రిఫర్‌ చేస్తున్నారు. * డెంగీని గుర్తించేందుకు 3-5 రోజుల్లోపు ఎన్‌ఎస్‌1 పరీక్ష, 5 రోజులు దాటితే ఐజీఎం యాంటిబాడీల టెస్టు అవసరం. లక్షణాలు బట్టి మలేరియా, టైఫాయిడ్‌ పరీక్షలూ చేస్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని