Jayasudha: జయసుధ భాజపాలో చేరుతున్నారా?

ప్రముఖ సినీనటి జయసుధ భాజపాలో చేరనున్నారంటూ గత కొద్దిరోజులగా ఊహాగానాలు వెలువడుతున్నాయి. పార్టీలో చేరిక అంశంపై తెలంగాణ భాజపాకు చెందిన కొంతమంది

Published : 09 Aug 2022 15:23 IST

హైదరాబాద్‌: ప్రముఖ సినీనటి జయసుధ భాజపాలో చేరనున్నారంటూ గత కొద్దిరోజులుగా ఊహాగానాలు వెలువడుతున్నాయి. పార్టీలో చేరిక అంశంపై తెలంగాణ భాజపాకు చెందిన కొంతమంది నేతలు కూడా ఆమెతో చర్చలు జరిపినట్లు సమాచారం. ఈనెల 21న మునుగోడులో జరిగే సభలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా సమక్షంలో జయసుధ భాజపాలో చేరుతారంటూ వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆమె స్పందించారు. 

మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆలోచన లేదని జయసుధ స్పష్టం చేశారు. 21న భాజపాలో చేరడం లేదన్నారు. భాజపా నేతల ముందు ఆమె కొన్ని ప్రతిపాదనలు పెట్టినట్లు తెలుస్తోంది. వాటికి అంగీకరిస్తేనే భాజపాలో చేరేందుకు సిద్ధమని జయసుధ చెప్పినట్లు తెలిసింది. దిల్లీ పెద్దలు మాట్లాడి హామీ ఇస్తేనే భాజపాలో చేరేందుకు ఓకే చెప్తానని ఆమె చెప్పినట్లు సమాచారం. 

గతంలో కాంగ్రెస్‌లో కొనసాగిన జయసుధ.. 2009లో సికింద్రాబాద్‌ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014 తర్వాత నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని