దిల్లీ మేయర్‌ ఎన్నికలు వాయిదా

వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది.

Published : 26 Apr 2024 04:27 IST

దిల్లీ: వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. ముఖ్యమంత్రి జ్యుడిషియల్‌ కస్టడీలో ఉన్నారని, ఆయన రాజ్యాంగ పరమైన బాధ్యతలను నెరవేర్చలేని అసాధారణ పరిస్థితులు నెలకొన్నాయని లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వి.కె.సక్సేనా పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం సక్సేనా తరఫున రాజ్‌నివాస్‌ ఓ లేఖ విడుదల చేసింది. అనంతరం నగరపాలక సంస్థ ఎన్నికలను వాయిదా వేసింది. దిల్లీ మద్యం విధానంతో సంబంధమున్న నగదు అక్రమ చలామణి నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కేసులో అరెస్టై ప్రస్తుతం తిహాడ్‌ జైల్లో ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ ఉన్నారని, ఆయన అభిప్రాయం లేకుండా ప్రిసైడింగ్‌ అధికారిని నియమించలేమని, అలా నియమించడం సముచితం కూడా కాదని అందులో పేర్కొన్నారు.

భాజపా ఆదేశాల మేరకే: ఆతిశీ

భాజపా ఆదేశాల మేరకే మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నికలను వాయిదా వేేశారని దిల్లీ మంత్రి ఆతిశీ ఆరోపించారు. దళిత అభ్యర్థి మేయర్‌ కావడం భాజపాకు ఇష్టం లేకనే అలా చేశారన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని