తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు.

Published : 26 Apr 2024 04:32 IST

 

జాతీయ, రాష్ట్ర కమిటీల్లో పలువురి నియామకం

ఈనాడు డిజిటల్‌, అమరావతి: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. పార్టీ జాతీయ, రాష్ట్ర కమిటీల్లో పలువురు కొత్తవారికి చోటు కల్పించినట్లు రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. బాపట్ల లోక్‌సభ నియోజకవర్గ పార్టీ అధ్యక్షుడిగా సలగల రాజశేఖర్‌ను నియమించారు. రాష్ట్ర అధికార ప్రతినిధులుగా ఉన్నం మారుతిచౌదరి, కోడూరు బాలసుబ్రమణ్యం, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులుగా కనపర్తి శ్రీనివాసరావు, మాన్వి దేవేంద్రమ్మ, గుడిసె ఆదికృష్ణమ్మ, ఇందుకూరి సుబ్బలక్ష్మి, కేఎం జకీవుల్లా, జంపాల సీతారామయ్య, కేవీవీ సత్యనారాయణరావు, పుట్టం బ్రహ్మానందరెడ్డిని నియమించారు. రాష్ట్ర కార్యదర్శులుగా గుర్రం వెంకటేశ్‌, కేసనపల్లి జయరామ్‌నాయుడు, బూరగడ్డ కిషన్‌తేజ, కోటగుల్లి సుబ్బారావు, కల్లపరి బుడ్డారెడ్డి, కిల్లో వెంకట రమేష్‌నాయుడు, దొడ్డా వెంకట సుబ్బారెడ్డి, అయితాబత్తుల సత్యశ్రీ, గేదల శ్రీనుబాబు, మోజూరు తోజోవతిని నియమించినట్లు పేర్కొన్నారు.

తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధిగా సాకే వెంకట నరసింహులు, తెలుగు మహిళా రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా మల్లెల శ్రీవాణి, కార్యనిర్వాహక కార్యదర్శిగా బిడ్డిక పద్మావతి, తెలుగు రైతు కార్యనిర్వాహక కార్యదర్శిగా సన్నపురెడ్డి ప్రకాశ్‌రెడ్డిని నియమించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని