logo

విదేశాంగ విధానంలో ప్రధాని చొరవ భేష్‌

ప్రపంచదేశాలతో సత్సంబంధాలు కొనసాగిస్తూనే జాతీయ ప్రయోజనాలపై రాజీ పడకుండా విదేశాంగ విధానాన్ని ప్రధాని నరేంద్రమోదీ తీర్చిదిద్దారని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్‌ ఎస్‌.జైశంకర్‌ అన్నారు. దీనివల్ల ప్రపంచ దేశాల

Published : 10 Aug 2022 02:45 IST

ఈనాడు, హైదరాబాద్‌: ప్రపంచదేశాలతో సత్సంబంధాలు కొనసాగిస్తూనే జాతీయ ప్రయోజనాలపై రాజీ పడకుండా విదేశాంగ విధానాన్ని ప్రధాని నరేంద్రమోదీ తీర్చిదిద్దారని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్‌ ఎస్‌.జైశంకర్‌ అన్నారు. దీనివల్ల ప్రపంచ దేశాల ముందు భారత్‌ సరికొత్త దృక్పథం కనబరుస్తోందన్నారు. మంగళవారం నగరంలోని ఆంగ్ల, విదేశీ భాషల విశ్వవిద్యాలయం్బఇఫ్ల్శూలో ్ఞమోదీ..20: డ్రీమ్స్‌ మీట్‌ డెలివర్ఠీ పుస్తకంపై చర్చా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జైశంకర్‌ మాట్లాడుతూ.. ప్రపంచవేదికపై మోదీ ప్రతిష్ఠను పెంచుకోవడం వల్ల స్వతహాగా తనకు ఎలాంటి లాభం లేకున్నా.. ఆయన తీసుకుంటున్న నిర్ణయాలతో భారత్‌కు ఎంతో మేలు చేకూరుతుందన్నారు. జస్టిస్‌ ఎల్‌.నర్సింహారెడ్డి మాట్లాడుతూ.. కరోనా మహమ్మారి సమయంలో మోదీ అనుసరించిన విధానాలతో ప్రపంచదేశాలలో భారత్‌పై ఉన్న దృక్పథంలో ఎంతో మార్పు వచ్చిందన్నారు. సమావేశానికి అధ్యక్షత వహించిన ఇఫ్లూ ఉపకులపతి ప్రొ.ఇ.సురేశ్‌కుమార్‌ పుస్తకంపై చర్చించారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, విదేశాంగ మంత్రి జైశంకర్, జాతీయ భద్రత సలహాదారు అజిత్‌దోవల్‌ తదితర వివిధ రంగాలకు చెందిన వారు ప్రధాని మోదీ సమర్థతపై పుస్తకంలో పొందుపరిచిన వ్యాఖ్యలను ఉటంకించారు. పుస్తకాన్ని చదివితే దేశానికి మోదీ చేసిన సేవలు తెలుసుకోవడంతోపాటు స్ఫూర్తినిస్తుందని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని