logo

28న గంగ తెప్పోత్సవం

గంగ తెప్పోత్సవం ఈనెల 28న జరుపుతున్నట్లు ఖైరతాబాద్‌ గంగపుత్ర సంఘం అధ్యక్షులు మహేందర్‌బాబు తెలిపారు. బుధవారం తుమ్మలబస్తీలోని గంగపుత్ర సంఘం హాలులో గంగ తెప్పోత్సవ సమావేశం జరిగింది.

Updated : 11 Aug 2022 04:05 IST

ఉత్సవాల బ్యానర్‌ను ప్రదర్శిస్తున్న ప్రతినిధులు

ఖైరతాబాద్‌, న్యూస్‌టుడే: గంగ తెప్పోత్సవం ఈనెల 28న జరుపుతున్నట్లు ఖైరతాబాద్‌ గంగపుత్ర సంఘం అధ్యక్షులు మహేందర్‌బాబు తెలిపారు. బుధవారం తుమ్మలబస్తీలోని గంగపుత్ర సంఘం హాలులో గంగ తెప్పోత్సవ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఐదో ఏడాది జరుగుతున్న గంగ తెప్పోత్సవం ఈనెల 28న ఉదయం 11 గంటలకు స్థానిక సప్తమాత ఆలయం నుంచి గంగమ్మ గుడి వరకు బోనాలతో ర్యాలీ సాగుతుందని వివరించారు. సమావేశంలో తెలంగాణ గంగపుత్రుల జేఏసీ అధ్యక్షుడు ఎ.సుదర్శన్‌, ప్రతినిధులు మెట్టు సాయిరాజు, పూస నర్సింహ, గోలి రమేష్‌, పాశం సురేందర్‌, మెట్టు సూర్యప్రకాష్‌, తెలంగాణ గంగపుత్ర జేఏసీ యువజన అధ్యక్షుడు గౌట్‌ గణేష్‌, నాయకులు కావూరి వెంకటేష్‌, యాదగిరి, కంది నారాయణకుమార్‌, శంకర్‌, గాలి ప్రభాకర్‌, రాజేష్‌, శ్యామ్‌, సత్యనారాయణ, కొండా స్వామి లింగం, అశోక్‌ తదితరులు ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని