logo

సంక్షేమం పేరుతో మోసం: వైతెపా

తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంక్షేమ పథకాల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని వైతెపా అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు. శుక్రవారం ఆమె మండలంలోని సూరాయిపల్లి మీదేగా చెల్లాపూర్‌, ఈర్లపల్లి గ్రామాల నుంచి దౌల్తాబాద్‌

Updated : 13 Aug 2022 05:10 IST

ప్రసంగిస్తున్న షర్మిల

దౌల్తాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంక్షేమ పథకాల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని వైతెపా అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు. శుక్రవారం ఆమె మండలంలోని సూరాయిపల్లి మీదేగా చెల్లాపూర్‌, ఈర్లపల్లి గ్రామాల నుంచి దౌల్తాబాద్‌ వరకు ప్రజాప్రస్థానం పాదయాత్రను నిర్వహించారు. అనంతరం మండల కేంద్రంలో వైఎస్సార్‌ విగ్రహానికి నివాళులు అర్పించారు. అనంతరం అక్కడే ప్రజలతో ఏర్పాటు చేసిన మాట ముచ్చట కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పింఛన్లు, రెండు పడకల ఇళ్లు, కల్యాణలక్ష్మి, కళాశాల లేదని పలువురు వాపోయారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు తమ్మలి బాలరాజు, మండల నాయకులు పకీరప్ప తదితరులున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని