logo

దేశం గర్వించేలా పతకాలు సాధిస్తా

అంతర్జాతీయ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో భారత దేశం గర్వించేలా మరిన్ని పతకాలు సాధించడమే తన ఉన్నత లక్ష్యమని నిఖత్‌ జరీన్‌ పేర్కొన్నారు. కామన్వెల్త్‌ క్రీడల్లో పసిడి పతకం సాధించిన నిఖత్‌ జరీన్‌ ఆదివారం

Updated : 15 Aug 2022 04:28 IST

శంషాబాద్‌, న్యూస్‌టుడే: అంతర్జాతీయ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో భారత దేశం గర్వించేలా మరిన్ని పతకాలు సాధించడమే తన ఉన్నత లక్ష్యమని నిఖత్‌ జరీన్‌ పేర్కొన్నారు. కామన్వెల్త్‌ క్రీడల్లో పసిడి పతకం సాధించిన నిఖత్‌ జరీన్‌ ఆదివారం ఉదయం శంషాబాద్‌ విమానాశ్రయంలో దిగారు. పసిడి పతకాన్ని ప్రదర్శిస్తూ బయటకు వచ్చిన ఆమెకు తెలంగాణ క్రీడాశాఖ ఆధ్వర్యంలో అధికారులు, క్రీడాకారులు జాతీయ పతాకాలతో స్వాగతం పలికారు. అనంతరం బొకేలు అందజేసి శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా నిఖత్‌ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో అసాధారణ ప్రతిభ ఉన్న బాలికలు చదువుతో పాటు క్రీడలపై ప్రత్యేక దృష్టి సారించాలని పిలుపునిచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని