logo

Cyber Crime: క్రెడిట్‌ కార్డు పరిమితి రూ.45 వేలు.. కొట్టేసింది రూ.41 లక్షలు!

క్రెడిట్‌ కార్డు రుణ పరిమితి రూ.45 వేలు. కార్డుదారు ఏకంగా రూ.41.69 లక్షలు వాడుకున్నాడు. ఇంకో వ్యక్తి క్రెడిట్‌ కార్డు పరిమితి రూ.90 వేలుంటే..

Updated : 17 Aug 2022 07:41 IST

ఈనాడు- హైదరాబాద్‌: క్రెడిట్‌ కార్డు రుణ పరిమితి రూ.45 వేలు. కార్డుదారు ఏకంగా రూ.41.69 లక్షలు వాడుకున్నాడు. ఇంకో వ్యక్తి క్రెడిట్‌ కార్డు పరిమితి రూ.90 వేలుంటే.. రూ.26.85 లక్షలు లాగేశాడు. బ్యాంకు సిబ్బందికి అంతుబట్టక సైబరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీసులను ఆశ్రయించారు. గచ్చిబౌలిలోని ఓ బ్యాంకులో ఇద్దరు వ్యక్తులు క్రెడిట్‌ కార్డులు తీసుకున్నారు. వీరు కార్డుల పరిమితికి మించి రూ.68.55 లక్షలు వాడుకున్నారు. వాస్తవానికి రెండు కార్డుల రుణ పరిమితి రూ.1.35 లక్షలే. బ్యాంకు సిబ్బంది ఈ అనుమానాస్పద లావాదేవీలను గుర్తించారు. కార్డుదారులను సంప్రదించేందుకు సిబ్బంది ప్రయత్నించగా, ముందుఇచ్చిన చిరునామాలో అందుబాటులో లేరు. బ్యాంకు మేనేజర్‌ సైబర్‌ క్రైం ఠాణాలో ఫిర్యాదు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని