logo

Hyderabad Police: చిట్టా తీసి చలానా వసూలు

నిబంధనలు ఉల్లంఘించి యథేచ్ఛగా తిరిగిన వాహనదారులు.. బకాయిలు పేరుకుపోవడంతో మరో బండి కొనుగోలు చేసి దానిపై ప్రయాణిస్తూ పట్టుబడమనే ధీమాతో ఉంటారు. ఇక ఇటువంటి ఉల్లంఘనుల నుంచి పాత జరిమానా వసూలు చేసేందుకు

Updated : 26 Sep 2022 08:29 IST

ఈనాడు, హైదరాబాద్‌: నిబంధనలు ఉల్లంఘించి యథేచ్ఛగా తిరిగిన వాహనదారులు.. బకాయిలు పేరుకుపోవడంతో మరో బండి కొనుగోలు చేసి దానిపై ప్రయాణిస్తూ పట్టుబడమనే ధీమాతో ఉంటారు. ఇక ఇటువంటి ఉల్లంఘనుల నుంచి పాత జరిమానా వసూలు చేసేందుకు నగర ట్రాఫిక్‌ పోలీసులు సిద్ధమయ్యారు. నగరవ్యాప్తంగా స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టి కేసులు నమోదు చేయనున్నారు. నిత్యం 40 లక్షలకుపైగా వాహనాలు వివిధ మార్గాల్లో రాకపోకలు సాగిస్తుంటాయి. వీటిలో 70 శాతం ద్విచక్రవాహనాలు ఉంటున్నాయి. చలానా నుంచి తప్పించుకునేందుకు వాహనాల నంబరు ప్లేట్లను తొలగిస్తున్నారు. మరికొందరు పాతవి విక్రయించి కొత్త వాహనాలు కొనుగోలు చేస్తున్నారు. ఇక నుంచి ట్రాఫిక్‌ పోలీసులు తనిఖీల్లో యజమాని పేరుతో ఉన్న మిగిలిన వాహనాల వివరాలు బయటకు తీస్తారు. వాటిపై పాత చలానాలు ఉన్నట్లు గుర్తిస్తే వసూలు చేస్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని