logo

పేదలకు తక్షణ న్యాయం అందేలా కృషి చేయాలి

దేశంలో జరుగుతున్న పలు సంఘటనల్లో ప్రభుత్వాలు సమగ్ర విచారణ జరపకుండానే పేదలను జైలుకు పంపుతున్నాయని, అలాంటి వారికి తక్షణ న్యాయం అందాలని హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ అన్నారు. రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం

Published : 26 Sep 2022 02:40 IST

జస్టిస్‌ పుల్ల కార్తిక్‌ను సన్మానిస్తున్న గవర్నర్‌ దత్తాత్రేయ, మల్లేశం, రేవన్న తదితరులు

ఎల్బీనగర్‌, న్యూస్‌టుడే: దేశంలో జరుగుతున్న పలు సంఘటనల్లో ప్రభుత్వాలు సమగ్ర విచారణ జరపకుండానే పేదలను జైలుకు పంపుతున్నాయని, అలాంటి వారికి తక్షణ న్యాయం అందాలని హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ అన్నారు. రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్‌ పుల్ల కార్తిక్‌ను రాష్ట్ర కురుమ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఎల్బీనగర్‌లోని కేబీఆర్‌ ఫంక్షన్‌హాల్లో ఘనంగా సన్మానించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న దత్తాత్రేయ మాట్లాడుతూ.. కురుమలు వివిధ రంగాల్లో ఎదుగుతున్నారని, న్యాయమూర్తిగా పుల్ల కార్తిక్‌ నియామకం సంతోషకరమన్నారు. కర్ణాటక మాజీ మంత్రి రేవన్న మాట్లాడుతూ.. అంచెలంచెలుగా ఎదుగుతున్న బీసీ కులాల వారు రాజకీయంగానూ ప్రధాన పాత్ర పోషించాలన్నారు. జస్టిస్‌ పుల్ల కార్తిక్‌ మాట్లాడుతూ.. పేదలకు న్యాయ చేసేందుకు ఎల్లప్పుడూ ముందుంటానన్నారు. ఎమ్మెల్సీ యెగ్గె మల్లేశం, బండారు నారాయణ, క్యామమల్లేష్‌, కొండల్‌రాజ్‌, నర్సింహ, శ్రీకాంత్‌, అరుణ్‌కుమార్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని