logo

కుమార్తెపై లైంగికదాడికి యత్నం

కుమార్తెపై కన్నతండ్రి లైంగికదాడికి యత్నించిన ఘటన బంజారాహిల్స్‌ పోలీసు ఠాణా పరిధిలో చోటుచేసుకొంది. ఎస్సై మనోజ్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. బంజారాహిల్స్‌లో నివసించే వ్యక్తి(46) చిరువ్యాపారి. ఇటీవల ఇంట్లో ఎవరూ

Published : 01 Oct 2022 03:11 IST

జూబ్లీహిల్స్‌, న్యూస్‌టుడే: కుమార్తెపై కన్నతండ్రి లైంగికదాడికి యత్నించిన ఘటన బంజారాహిల్స్‌ పోలీసు ఠాణా పరిధిలో చోటుచేసుకొంది. ఎస్సై మనోజ్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. బంజారాహిల్స్‌లో నివసించే వ్యక్తి(46) చిరువ్యాపారి. ఇటీవల ఇంట్లో ఎవరూ లేని సమయంలో తన తొమ్మిదేళ్ల కుమార్తెపై లైంగిక దాడికి యత్నించాడు. ఇంటికి వచ్చిన తల్లితో చిన్నారి జరిగిన విషయం చెప్పడంతో ఆమె భర్తను నిలదీసింది. అతడు సమాధానం ఇవ్వకపోడంతో బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు తండ్రిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేసినట్లు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని