logo

అంతర్‌ జిల్లా ద్విచక్ర వాహన దొంగల అరెస్టు

అంతర్‌ జిల్లా ద్విచక్ర వాహన చోరులను సిద్దిపేట వన్‌టౌన్‌ పోలీసులు అరెస్టు చేశారు. వివరాలను ఏసీపీ దేవారెడ్డి శనివారం వెల్లడించారు.

Published : 27 Nov 2022 03:34 IST

సిద్దిపేట: అంతర్‌ జిల్లా ద్విచక్ర వాహన చోరులను సిద్దిపేట వన్‌టౌన్‌ పోలీసులు అరెస్టు చేశారు. వివరాలను ఏసీపీ దేవారెడ్డి శనివారం వెల్లడించారు. ఎస్‌ఐలు మల్లేశం, నర్సింహారావు, స్రవంతి, సిబ్బందితో కలిసి స్థానిక ముస్తాబాద్‌ చౌరస్తా వద్ద వాహనాల తనిఖీ చేస్తున్న క్రమంలో ఇద్దరు యువకులు అనుమానాస్పదంగా కనిపించారు. అదుపులోకి తీసుకుని విచారించగా చోరీల చిట్టా విప్పారు. వికారాబాద్‌ జిల్లా బంట్వారం మండలం తోరుమామిడికి చెందిన వెల్డింగ్‌ వర్కర్‌ గుడాల మాణిక్యం, మేడ్చల్‌ జిల్లా మల్కాజ్‌గిరికి చెందిన దేవరకొండ ఫణీంద్రకుమార్‌ వాహన చోరీల్లో, సిద్దిపేటకు చెందిన షాదుల్లా దొంగతనం కేసులో గతంలో చర్లపల్లిలో జైలులో శిక్ష అనుభవించే క్రమంలో పరిచయం ఏర్పడింది. మరోసారి వక్రబుద్ధితో చోరీలకు పాల్పడాలని నిర్ణయించుకున్నారు. మాణిక్యం, ఫణీంద్రకుమార్‌లు కలిసి మూడు నెలల వ్యవధిలో.. ఖమ్మం, సదాశివపేట, కొండాపూర్‌, రుద్రారం, పటాన్‌చెరు, తాండూరు, వికారాబాద్‌ తదితర ప్రాంతాల్లో 13 ద్విచక్ర వాహనాలను ఎత్తుకెళ్లారు. అందులో మూడింటిని నార్సింగి పోలీసులు వేర్వేరు సందర్భాల్లో పట్టుకున్నారు. మిగిలిన తొమ్మిది వాహనాలను సిద్దిపేటలో షాదుల్లా ఇంటి ఆవరణలో దాచి పెట్టారు. మరో వాహనంపై మాణిక్యం, ఫణీంద్రకుమార్‌లు పట్టణంలో తిరుగుతూ పట్టుబడ్డారు. మొత్తం పది వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. షాదుల్లా పరారీలో ఉన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు