logo

చట్టపరంగానే పిల్లల దత్తత: సీడీపీఓ

పిల్లలు లేని తల్లిదండ్రులు చట్టపరంగానే దత్తత తీసుకోవాలని సీడీపీఓ వెంకటేశ్వరమ్మ తెలిపారు.

Published : 01 Dec 2022 02:37 IST

మాట్లాడుతున్న సీడీపీఓ వెంకటేశ్వరమ్మ

వికారాబాద్‌ మున్సిపాలిటీ: పిల్లలు లేని తల్లిదండ్రులు చట్టపరంగానే దత్తత తీసుకోవాలని సీడీపీఓ వెంకటేశ్వరమ్మ తెలిపారు. జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బుధవారం స్థానిక శిశు గృహలో ‘అంతర్జాతీయ దత్తత మాసోత్సవాల్లో’ భాగంగా జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. చట్టపరంగా దత్తత తీసుకున్న పిల్లలకు అన్ని రకాల రక్షణ ఉంటుందన్నారు. దత్తత తీసుకోవాలనుకునే వారు ఆన్‌లైన్‌లో కారాలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. వివరాల కోసం శిశుగృహను సంప్రదించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో బాలరక్ష భవన్‌ సమన్వయకర్త శ్రీలక్ష్మి, బాలల పరిరక్షణాధికారి శ్రీకాంత్‌, పిల్లల దత్తత కోసం వచ్చిన తల్లిదండ్రులు, పాల్గొన్నారు.    

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని