logo

జీవో 317 రద్దు చేయాల్సిందే

రాష్ట్రంలో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న అనేక మంది స్థానికతనే కోల్పోయే ప్రమాదం తెచ్చిన జీవో 317ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ పలువురు ఉపాధ్యాయులు ఆదివారం ప్రగతిభవన్‌ ముట్టడికి ప్రయత్నించారు.

Published : 05 Dec 2022 04:27 IST

ప్రగతి భవన్‌ ముట్టడికి యత్నం

రోడ్డుపై బైఠాయించిన ఉపాధ్యాయులు

సోమాజిగూడ, న్యూస్‌టుడే: రాష్ట్రంలో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న అనేక మంది స్థానికతనే కోల్పోయే ప్రమాదం తెచ్చిన జీవో 317ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ పలువురు ఉపాధ్యాయులు ఆదివారం ప్రగతిభవన్‌ ముట్టడికి ప్రయత్నించారు. పోలీసులు ఎక్కడికక్కడ నిఘా ఉంచినా వారి కళ్లుగప్పి పలువురు ఉపాధ్యాయులు ప్రగతి భవన్‌ ఎదుటి వరకు చేరుకొని ప్లకార్డులు ప్రదర్శిస్తూ బైఠాయించారు. పోలీసులు వారిని అరెస్టు చేసి పంజాగుట్ట, గోషామహల్‌ ఠాణాలకు తరలించి సాయంత్రం సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం రాత్రికి రాత్రే తీసుకొచ్చిన 317 జీఓతో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. స్థానికత నినాదంగా ఏర్పడిన తెలంగాణలో తామంతా స్థానికత కోల్పోయి ఉన్న ఊరిని, కన్నవారిని వదిలి ఉండాల్సి వస్తోందన్నారు. జీవో కారణంగా మనో వేదనతో కొందరు ఆత్మహత్యలకు చేసుకున్నారన్నారు. ఉపాధ్యాయులంతా తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని, వెంటనే ఇతర జిల్లాలకు పంపిన వారిని సొంత జిల్లాలకు బదిలీ చేయాలని డిమాండ్‌ చేశారు. లేని పక్షంలో తమ పోరాటం తీవ్రం చేసి రాష్ట్రాన్ని సాధించుకున్నట్లే స్థానికతను సాధించుకుంటామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని