logo

క్రిస్మస్‌ ఘనంగా నిర్వహించండి

క్రిస్మస్‌ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అధికారులను ఆదేశించారు.

Published : 09 Dec 2022 04:43 IST

హోంమంత్రి మహమూద్‌ అలీతో కలిసి మాట్లాడుతున్న మంత్రి తలసాని

ఈనాడు, హైదరాబాద్‌: క్రిస్మస్‌ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అధికారులను ఆదేశించారు. గురువారం మాసబ్‌ట్యాంక్‌లోని తన కార్యాలయంలో హోమ్‌ మంత్రి మహమూద్‌అలీతో కలిసి క్రిస్మస్‌ వేడుకల నిర్వహణపై ప్రజా ప్రతినిధులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఒక్కో నియోజకవర్గ పరిధిలో ఎనిమిది ప్రాంతాల్లో క్రిస్మస్‌ వేడుకల నిర్వహణకు ఎమ్మెల్యేలు ప్రత్యేకశ్రద్ధ వహిస్తారని తెలిపారు. చర్చి కమిటీ ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించి విందు, గిఫ్ట్‌ ప్యాక్‌ల పంపిణీకి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇందుకోసం నియోజకవర్గానికి ఒక్కో అధికారిని నియమించామని వివరించారు. సమావేశంలో మండలి ప్రభుత్వ విప్‌ ప్రభాకర్‌రావు, ఎమ్మెల్సీలు స్టీఫెన్‌సన్‌, సురభివాణిదేవి, హసన్‌జాఫ్రీ, ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్‌, దానం నాగేందర్‌, కాలేరు వెంకటేశ్‌, ముఠా గోపాల్‌, కౌసర్‌ మొహినోద్దీన్‌, డిప్యూటీ మేయర్‌ మోతె శ్రీలత, కిస్ట్రియన్‌ మైనారిటీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ఎం.డి.కాంతి వెస్లీ, ప్రాజెక్టు డైరెక్టర్‌ సౌజన్య తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని