logo

వ్యాపారులకు ‘పోలీస్‌ లైసెన్సు’

ఏదైనా వ్యాపారం చేయాలంటే గతంలో జీహెచ్‌ఎంసీ నుంచి ‘ట్రేడ్‌ లైసెన్సు’, ఫుడ్‌ లైసెన్సు, అగ్నిమాపక శాఖ నుంచి ఎన్‌ఓసీతో పాటు పోలీసు లైసెన్సు తీసుకోవాల్సి ఉండేది.

Published : 25 Jan 2023 01:47 IST

తొమ్మిదేళ్ల తర్వాత పునరుద్ధరణ

నారాయణగూడ, న్యూస్‌టుడే: ఏదైనా వ్యాపారం చేయాలంటే గతంలో జీహెచ్‌ఎంసీ నుంచి ‘ట్రేడ్‌ లైసెన్సు’, ఫుడ్‌ లైసెన్సు, అగ్నిమాపక శాఖ నుంచి ఎన్‌ఓసీతో పాటు పోలీసు లైసెన్సు తీసుకోవాల్సి ఉండేది. సాంకేతిక కారణాల వల్ల 2014 తర్వాత పోలీసు లైసెన్సు రద్దు చేశారు. ఇప్పుడు మళ్లీ తొమ్మిదేళ్ల తర్వాత పోలీసు లైసెన్సు నిబంధన తెరపైకొచ్చింది. ఇప్పటికే నగరంలోని ఆయా ఠాణాల పరిధిలోని పెద్దా చిన్నా వ్యాపార సముదాయాలు, హోటళ్లు, బేకరీల నిర్వాహకులను పోలీసులు కలుస్తూ.. పోలీసు లైసెన్సు తీసుకోవాలని అవగాహన కల్పిస్తున్నారు.

ఎవరు తీసుకోవాలంటే.. : స్టార్‌ హోటల్స్‌, బార్‌ అండ్‌ రెస్టారెంట్‌, పబ్‌లు, కాఫీ షాప్‌, టీ స్టాల్‌, కెఫే, బేకరీ రెస్టారెంట్‌, ఐస్‌ క్రీమ్‌ పార్లర్‌, స్వీట్‌ షాప్‌, జ్యూస్‌ సెంటర్‌, సినిమా థియేటర్‌ క్యాంటిన్‌, డ్రైవ్‌ ఇన్‌ రెస్టారెంట్‌, హోటళ్లు, దాబాలు, సినిమాటోగ్రఫీ, ఎక్స్‌ప్లోజివ్‌, ఫైర్‌ క్రాకర్స్‌, పెట్రోలియం ఉత్పత్తులు విక్రయించేవారు ఈ లైసెన్సు తీసుకోవాలి.

ఆన్‌లైన్‌లో దరఖాస్తులు.. : ఏటా ఏప్రిల్‌ 1 నుంచి తదుపరి ఏడాది మార్చి 31 వరకు గడువుతో లైసెన్సులు జారీ చేస్తామని నారాయణగూడ ఇన్‌స్పెక్టర్‌ రాపోలు శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. దీనికి వ్యాపార స్థాయిని బట్టి రూ.1000 నుంచి రూ.15000 వరకు రుసుం చెల్లించాల్సి ఉంటుంది. వ్యాపారులు hyderabadpolice.gov.in వెబ్‌సైట్‌ను తెరిచి అప్పటికే ఉన్న జీహెచ్‌ఎంసీ ట్రేడ్‌ లైసెన్సు, అద్దె, ఇతర ఒప్పంద పత్రాలను జత చేసి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. వారం, పది రోజుల్లో లైసెన్సు ఆన్‌లైన్‌ ద్వారా జారీ అవుతుంది. ఈ ఏడాది మార్చి 31 వరకు దరఖాస్తులకు అవకాశం కల్పించారు. ఆలోపు లైసెన్సు పొందకపోతే చట్ట పరమైన చర్యలు ఉంటాయని పోలీసులు పేర్కొన్నారు.  

వాట్సాప్‌ గ్రూప్‌లు ఏర్పాటు చేసి..

ఈ లైసెన్సు విధానం ద్వారా నగరంలోని ఆయా ఠాణాల పరిధిలో వ్యాపార సముదాయాలు, హోటళ్లు, ఇతర వ్యాపారాలు ఎన్ని ఉన్నాయో తెలుస్తుంది. వ్యాపారుల ఫోన్‌ నంబరు, ఇతర వివరాలు సేకరించి వాట్సాప్‌ గ్రూప్‌లను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు సమాచారం అందజేసే విధంగా ప్రణాళిక రచించినట్లు పోలీసులు తెలిపారు.

Read latest Hyderabad News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు