logo

కొనసాగుతున్న దక్కన్‌ మాల్‌ కూల్చివేత

సికింద్రాబాద్‌ మినిస్టర్‌ రోడ్డులోని దక్కన్‌ మాల్‌ భవనం కూల్చివేత పనులు కొనసాగుతున్నాయి. ఈనెల 19న ఆరంతస్తుల ఈ భవనంలో భారీ అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే.

Published : 28 Jan 2023 02:59 IST

రెజిమెంటల్‌బజార్‌, న్యూస్‌టుడే: సికింద్రాబాద్‌ మినిస్టర్‌ రోడ్డులోని దక్కన్‌ మాల్‌ భవనం కూల్చివేత పనులు కొనసాగుతున్నాయి. ఈనెల 19న ఆరంతస్తుల ఈ భవనంలో భారీ అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఎప్పుడు కూలిపోతుందో తెలియని పరిస్థితి ఉండటంతో అధికారులు భవనం కూల్చివేతకు శ్రీకారం చుట్టారు. ఈ కాంట్రాక్టు దక్కించుకున్న మాలిక్‌ ట్రేడింగ్‌ అండ్‌ డిమాలిషన్‌ సంస్థ హైరీచ్‌ కాంబీ క్రషర్‌ యంత్రంతో గురువారం రాత్రి 11 గంటల నుంచి కూలివేతను ప్రారంభించింది. ఈ కూల్చివేతలు శుక్రవారం కూడా కొనసాగాయి. ఆరో అంతస్తు నుంచి కూల్చివేతలు చేపట్టడం, ఎత్తు ఎక్కువగా ఉండటంతో మొత్తం ప్రక్రియలో కొంత జాప్యం జరుగుతుంది. మాల్‌ చుట్టూ ఉన్న భవనాలకు ప్రమాదం జరగకుండా పనులు కొనసాగిస్తున్నామని అధికారులు తెలిపారు. అత్యాధునిక సాంకేతికత ఉన్న హైరీచ్‌ కాంబీ క్రషర్‌ యంత్రం పిల్లర్లు, కాలమ్స్‌ను కోస్తుందని, వాటి శిథిలాలు అక్కడే పడిపోతాయని మాలిక్‌  ముందస్తుగా రాంగోపాల్‌పేట్‌ పోలీసులు అక్కడున్న ఉత్తమ్‌ టవర్స్‌, గగన్‌ ప్యారడైజ్‌ అపార్ట్‌మెంట్ల వాసులను ఖాళీ చేయించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని