logo

ఎస్కార్ట్‌ కార్లూ వచ్చేశాయ్‌

ఫార్ములా-ఈ రేస్‌ పోటీలకు వేదికైన హైదరాబాద్‌కు రెండు రోజుల క్రితం రేసింగ్‌ కార్లు రాగా... తాజాగా శుక్రవారం ఎస్కార్ట్‌ కార్లు శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకున్నాయి.

Published : 04 Feb 2023 03:06 IST

ఈనాడు, హైదరాబాద్‌: ఫార్ములా-ఈ రేస్‌ పోటీలకు వేదికైన హైదరాబాద్‌కు రెండు రోజుల క్రితం రేసింగ్‌ కార్లు రాగా... తాజాగా శుక్రవారం ఎస్కార్ట్‌ కార్లు శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకున్నాయి. రేసింగ్‌ కార్లు నడిపేవారు ప్రమాదవశాత్తు గాయపడినా, ట్రాక్‌ తప్పినా వెంటనే వారిని రక్షించేందుకు ఈ కార్లను వినియోగిస్తారు. సేఫ్టీ కార్‌ పేరుతో మరో కారు తీసుకొచ్చారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో పరిస్థితులు చక్కబెట్టడంతో పాటు ట్రాక్‌ సరిగా ఉందా? లేదా? అని సేఫ్టీ కార్‌ నిపుణులు పరీక్షిస్తారు. ఈ కారు మైదానంలో ఉన్నంత వరకూ రేసును తాత్కాలికంగా నిలిపేస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని