అక్రమ బంధమే ఆయువు తీసింది
అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన వ్యక్తి మిస్టరీ వీడింది. వివరాల్లోకి వెళ్తే.. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్ ఠాణా పరిధి అవుషాపూర్‌కు చెందిన ఎస్‌కే మౌలానా(43) ఈ నెల 6న మృతి చెందాడు.
వీడిన మౌలానా మృతి మిస్టరీ
షానాబీ
ఘట్‌కేసర్, న్యూస్‌టుడే: అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన వ్యక్తి మిస్టరీ వీడింది. వివరాల్లోకి వెళ్తే.. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్ ఠాణా పరిధి అవుషాపూర్‌కు చెందిన ఎస్‌కే మౌలానా(43) ఈ నెల 6న మృతి చెందాడు. నాలుగేళ్ల క్రితం బతుకుదెరువుకు దుబాయ్ వెళ్లాడు. రెండేళ్ల క్రితం తిరిగొచ్చి కూలీగా పనిచేస్తున్నాడు. ఆయనకు భార్య షానాబీ(40), ఇద్దరు పిల్లలున్నారు. విదేశానికి వెళ్లిన సమయంలో గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో ఆమె వివాహేతర బంధం సాగించింది. అడ్డుగా ఉన్న భర్తను తొలగించుకోవాలని ప్రియుడితో కలిసి పథకం రచించారు.
పథకం ప్రకారమే.. : ఈ నెల 5న మద్యం కొనుగోలుకు మౌలానా భార్యను రూ.100 అడిగాడు. డబ్బులు లేవని, ఇంట్లో ఉన్న మద్యం సీసా ఇచ్చింది. అందులో విషం కలిపింది. తాగిన కొద్ది సేపటికే కడుపులో నొప్పిగా ఉందని చెప్పడంతో హడావుడిగా గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లింది. అక్కడి నుంచి ఈ నెల 6న నాగారంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకొచ్చింది. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. శవానికి పోస్టుమార్టం వద్దని భార్య చెప్పడంతో పోలీసులకు అనుమానం వచ్చి గ్రామంలో విచారణ చేపట్టారు. వైద్యులు నిర్వహించిన శవపరీక్షలో గుర్తు తెలియని విషం తాగినట్లు తేలింది. పోలీసులకు మరింత అనుమానం వచ్చి ఆమెను అదుపులోకి తీసుకొని విచారించారు. ప్రియుడి కోరిక మేరకు మద్యంలో విషం కలిపి ఇచ్చినట్లు ఒప్పుకొన్నట్లు సమాచారం. చెప్పినట్లు చేయకపోతే తనను చంపేస్తానని ప్రియుడు బెదిరించాడని చెప్పింది. పరారీలో ఉన్న ప్రియుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఆమెను అదుపులోకి తీసుకున్నామని, గురువారం కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తామని సీఐ వి.అశోక్‌రెడ్డి ‘న్యూస్‌టుడే’తో చెప్పారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Russia: ‘పుతిన్‌ను అరెస్టు చేయడమంటే.. యుద్ధాన్ని ప్రకటించినట్లే!’
-
India News
Anand Mahindra: తోలుబొమ్మ ‘నాటు నాటు’.. ఆనంద్ మహీంద్రా పోస్ట్ వైరల్
-
Sports News
Rohit - Gavaskar: ప్రపంచకప్ ముంగిట కుటుంబ బాధ్యతలా? రోహిత్ తీరుపై గావస్కర్ అసహనం
-
Crime News
Acid Attack: ప్రియుడితో వెళ్లిపోయిందని.. కోర్టులోనే భార్యపై యాసిడ్ దాడి!
-
Movies News
Srikanth: విడాకుల రూమర్స్.. భార్యతో కలిసి వెళ్లాల్సి వస్తోంది: శ్రీకాంత్
-
Politics News
Panchumarthi Anuradha: అప్పుడు 26ఏళ్లకే మేయర్.. ఇప్పుడు తెదేపా ఎమ్మెల్సీ!