logo

కంటి వెలుగుతో ఎంతో ప్రయోజనం: ఎమ్మెల్యే

ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిరుపేద ప్రజలకు ప్రయోజనం చేకూర్చేందుకు కంటి వెలుగు పథకాన్ని అమలు చేస్తున్నారని భారాస జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్యే ఆనంద్‌ అన్నారు.

Published : 21 Mar 2023 01:04 IST

వికారాబాద్‌ టౌన్‌, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిరుపేద ప్రజలకు ప్రయోజనం చేకూర్చేందుకు కంటి వెలుగు పథకాన్ని అమలు చేస్తున్నారని భారాస జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్యే ఆనంద్‌ అన్నారు. సోమవారం పట్టణంలోని బాల్‌భవన్‌లో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కంటి సమస్యలతో బాధపడుతున్న అనేక మంది గ్రామీణ నిరుపేదలు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారన్నారు. ప్రజలందరూ దీనిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

* నియోజకవర్గంలోని సెర్ప్‌ ఉద్యోగులకు ప్రభుత్వం జీవో విడుదల చేయడంతో హర్షం వ్యక్తం చేస్తూ సోమవారం ఎమ్మెల్యే ఆనంద్‌ను కలిసి కేక్‌ కట్‌ చేశారు. ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీఎంలు, సీసీలు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని