Srinivas Goud: పారిపోయినోళ్లను వదిలేసి మహిళపైనా మీ ప్రతాపం?: శ్రీనివాస్‌గౌడ్‌

దేశ సంపదను దోచుకుని విదేశాలకు పారిపోయిన వారిని ఎందుకు రప్పించడం లేదని భాజపా నేతలను తెలంగాణ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ప్రశ్నించారు.

Updated : 21 Mar 2023 15:41 IST

దిల్లీ: దేశ సంపదను దోచుకుని విదేశాలకు పారిపోయిన వారిని ఎందుకు రప్పించడం లేదని భాజపా నేతలను తెలంగాణ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ప్రశ్నించారు. మహిళ అని కూడా చూడకుండా ఎమ్మెల్సీ కవితను రోజూ విచారణకు పిలిచి గంటల కొద్దీ కూర్చోబెట్టి వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దిల్లీలో మీడియాతో ఆయన మాట్లాడారు. 

‘‘నీరవ్‌ మోదీ, లలిత్‌ మోదీ, విజయ్‌ మాల్యా ఎక్కడున్నారు? రూ.లక్షల కోట్లు కొల్లగొట్టిన వారి కేసులను వదిలేసి రూ.100కోట్ల స్కామ్‌ అంటూ మహిళపై కేసులు పెడుతున్నారు. మహిళ అని చూడకుండా రోజూ విచారణకు పిలిచి వేధిస్తున్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండానే స్కామ్‌ అని ఎలా అంటారు? తప్పు చేయలేదు కాబట్టి కవిత భయపడటం లేదు. భాజపా నేతలు ఒక మహిళపై వారి ప్రతాపం చూపిస్తున్నారు. ప్రశ్నించిన వారిపైనే కేసులు పెడుతున్నారు. కేసులున్నా భాజపాలో చేరితే వాళ్లను వదిలేస్తున్నారు’’ అని శ్రీనివాస్‌గౌడ్‌ మండిపడ్డారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని