logo

సీడీఎంలో ఘనంగా హెచ్‌డీఎంసీ స్నాతకోత్సవం

నగరంలోని కాలేజ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ మేనేజ్‌మెంట్‌(సీడీఎం)లో శుక్రవారం హయ్యర్‌ డిఫెన్స్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సు-18 స్నాతకోత్సవాన్ని నిర్వహించారు.

Published : 25 Mar 2023 02:21 IST

కెప్టెన్‌ అమిత్‌కుమార్‌సిన్హాకు ట్రోఫీ అందజేస్తున్న అడ్మిరల్‌ ఆర్‌.హరికుమార్‌

కంటోన్మెంట్‌, న్యూస్‌టుడే: నగరంలోని కాలేజ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ మేనేజ్‌మెంట్‌(సీడీఎం)లో శుక్రవారం హయ్యర్‌ డిఫెన్స్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సు-18 స్నాతకోత్సవాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిథిగా చీఫ్‌ ఆఫ్‌ నావల్‌ స్టాఫ్‌, అడ్మిరల్‌ ఆర్‌.హరికుమార్‌ హాజరయ్యారు. కోర్సులో భాగంగా 44 వారాలపాటు శిక్షణ పూర్తి చేసుకున్న 163మంది త్రివిధ దళాల అధికారులతోపాటు 14మంది స్నేహపూర్వక దేశాల అధికారులకు ధ్రువపత్రాలు అందజేసినట్లు రక్షణ పౌర సంబంధాల అధికారులు ఒక ప్రకటనలో వెల్లడించారు. శిక్షణలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన కెప్టెన్‌ అమిత్‌కుమార్‌ సిన్హాకు హరికుమార్‌ ట్రోఫీ అందజేశారు.  కోర్సు పూర్తి చేసుకున్న వివిధ దేశాల అధికారులకు ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి మాస్టర్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌, ఆల్‌ ఇండియా మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్‌ తరఫున మేనేజ్‌మెంట్‌లో అడ్వాన్స్‌ కోర్సు ధ్రువపత్రాలను అందజేసినట్లు అధికారులు వెల్లడించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు