కారు అడ్డగించి దాడి, దోపిడీ
కారులో వెళ్తున్న ఓ వ్యక్తిని అడ్డగించిన గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేసి, దోపిడీకి పాల్పడ్డారు. ఎస్సార్‌నగర్ ఠాణా పరిధిలో జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.
అమీర్‌పేట, న్యూస్‌టుడే: కారులో వెళ్తున్న ఓ వ్యక్తిని అడ్డగించిన గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేసి, దోపిడీకి పాల్పడ్డారు. ఎస్సార్‌నగర్ ఠాణా పరిధిలో జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఎస్సై స్వప్నారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..ఫతేనగర్‌లోని పైప్‌లైన్ రోడ్డుకు చెందిన మహ్మద్ మిస్కిన్(30) ప్రైవేటు ఉద్యోగి. ఈనెల 21న రాత్రి 11.45 గంటల ప్రాంతంలో తన కారులో ఫతేనగర్ నుంచి బల్కంపేటవైపు వెళ్తుండగా బల్కంపేట శ్మశానవాటిక సమీపంలో ముగ్గురు వ్యక్తులు బైక్‌పై ముందు వంకరటింకరగా వెళ్తూ ఇబ్బంది కలిగించారు. మిస్కిన్ హారన్ కొట్టడంతో ద్విచక్ర వాహనాన్ని కారుకు అడ్డంగా పెట్టి అతనిపై దాడి చేశారు. ఫోన్, మెడలోని బంగారు గొలుసు, రూ.2వేల నగదు తీసుకుని వారి ద్విచక్ర వాహనాన్ని అక్కడే వదిలి పరారయ్యారు. ఆసుపత్రిలో చికిత్స పొందిన బాధితుడు శనివారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
Hyderabad: ఒక్క మిస్డ్ కాల్‌తో రెండు జీవితాలు బలి.. రాజేశ్ మృతి కేసులో కీలక ఆధారాలు
-
India News
Wrestlers protest: గంగా నది తీరంలో రోదనలు.. పతకాల నిమజ్జానికి బ్రేక్
-
Crime News
భార్యపై అనుమానం.. నవజాత శిశువుకు విషమెక్కించిన తండ్రి
-
India News
Bengaluru: మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం.. ఎలాంటి షరతులుండవ్!: మంత్రి
-
Movies News
social look: విహారంలో నిహారిక.. షికారుకెళ్లిన శ్రద్ధా.. ఓర చూపుల నేహా
-
Politics News
Lokesh: రూ.లక్ష కోట్లున్న వ్యక్తి పేదవాడు ఎలా అవుతారు?: లోకేశ్