Hyderabad: విశ్రాంత ఐపీఎస్ ఇంట్లో భారీ చోరీ
విశ్రాంత ఐపీఎస్ ఇంట్లో భారీ చోరీ జరిగింది. జూబ్లీహిల్స్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జూబ్లీహిల్స్ ప్రశాసన్‌నగర్ ఫ్లాట్ నంబరు 222లో నివసించే విశ్రాంత ఐపీఎస్ కొమ్మి ఆనందయ్య.
ఇంట్లో చిందరవందరగా సామగ్రి
జూబ్లీహిల్స్, న్యూస్‌టుడే: విశ్రాంత ఐపీఎస్ ఇంట్లో భారీ చోరీ జరిగింది. జూబ్లీహిల్స్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జూబ్లీహిల్స్ ప్రశాసన్‌నగర్ ఫ్లాట్ నంబరు 222లో నివసించే విశ్రాంత ఐపీఎస్ కొమ్మి ఆనందయ్య ఈనెల 16న భార్యతో కలిసి కాకినాడలో మున్సిపల్ కమిషనర్‌గా ఉన్న కుమారుడు రమేష్ ఇంటికి వెళ్లారు. శనివారం ఆనందయ్య ఇంటి వద్ద పనిచేస్తూ కింద సెల్లార్‌లో నివసించే డ్రైవర్ ఫోన్ చేసి ఇంట్లో చోరీ జరిగిందని తెలిపాడు. దీంతో ఆయన వచ్చి పరిశీలించగా, అల్మారాలో ఉంచిన 30 తులాల బంగారు, 20 తులాల వెండి ఆభరణాలు, రూ. 40వేల నగదు, 500 అమెరికన్ డాలర్లు, ఎనిమిది విలువైన చేతి గడియారాలు చోరీకి గురైనట్లు గుర్తించారు. ఈ మేరకు శనివారం రాత్రి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీసీ కెమెరాల ఫుటేజీ పరిశీలించగా, ఆగంతుకుడు శుక్రవారం అర్ధరాత్రి 1.15 ప్రాంతంలో ఆనందయ్య ఇంటి వెనుక నుంచి రెండో అంతస్తుకు వెళ్లాడు. వెళ్లి అక్కడ బోల్టు పెట్టిన ఉన్న తలుపు తన్ని, అది తెరచుకోవడంతో తొలుత వంటగదిలోకి వెళ్లాడు. కొన్ని వెండి వస్తువులను సంచిలో వేసుకున్నాడు. మొదటి అంతస్తులోకి వెళ్లి బీరువా తాళం లేకుండానే తెరిచాడు. లాకర్‌లో ఉన్న బంగారు, వెండి ఆభరణాలతో పాటు నగదు, డాలర్లు, చేతిగడియారాలను తీసుకున్నాడు. దాదాపు గంటపాటు ఇంట్లోనే గడిపాడు. బయటకు వచ్చి లిఫ్ట్ అడిగి బాటా కూడలి వరకు, అక్కడ నుంచి సీవీఆర్ కూడలి చేరుకున్నాడు. అక్కడ ఇంకో వాహనం ఎక్కి వెళ్లిపోయాడు. ముందుగా రెక్కీ చేసి చోరీకి పాల్పడి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. దొంగను పట్టుకొనేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి గాలిస్తున్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ts-top-news News
Raghunandan: ఎమ్మెల్యే రఘునందన్‌పై రూ.1000 కోట్లకు పరువునష్టం దావా
-
Sports News
Dhoni: రిటైర్మెంట్పై నిర్ణయానికి ఇది సరైన సమయమే కానీ.. ధోనీ ఆసక్తికర వ్యాఖ్యలు
-
India News
Bus Accident: లోయలో పడిన బస్సు.. ఏడుగురి మృతి
-
Ap-top-news News
CM Jagan Tour: జగన్ పర్యటన.. పత్తికొండలో విద్యుత్ కోతలు
-
Sports News
Dhoni Fans: ధోనీ అభిమానులకు అక్కడే పడక
-
Crime News
TDP-Mahanadu: మహానాడు నుంచి వెళ్తూ తెదేపా నాయకుడి దుర్మరణం