logo

దుబాయ్‌ నుంచి అక్రమంగా తరలిస్తున్న బంగారం పట్టివేత

దుబాయ్‌ నుంచి వస్తున్న ఓ విమాన ప్రయాణికుడు మల ద్వారంలో 840 గ్రాముల బంగారం పెట్టుకుని తరలిస్తూ శంషాబాద్‌ విమానాశ్రయంలో పట్టుబడ్డాడు.

Published : 29 Mar 2023 02:09 IST

స్వాధీనం చేసుకున్న బంగారం

శంషాబాద్‌, న్యూస్‌టుడే: దుబాయ్‌ నుంచి వస్తున్న ఓ విమాన ప్రయాణికుడు మల ద్వారంలో 840 గ్రాముల బంగారం పెట్టుకుని తరలిస్తూ శంషాబాద్‌ విమానాశ్రయంలో పట్టుబడ్డాడు. విమానాశ్రయం అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి దుబాయ్‌ నుంచి ఎమిరేట్స్‌ విమాన సర్వీస్‌లో స్వదేశానికి బయల్దేరాడు. ఈ క్రమంలో 840 గ్రాముల బంగారాన్ని మూడు క్యాప్సుల్స్‌గా తయారు చేసి మలద్వారంలో పెట్టుకొని తీసుకొచ్చాడు. ప్రయాణికుడి ప్రవర్తనపై భద్రతాధికారులకు అనుమానం రాగా అదుపులోకి తీసుకుని విచారించగా గుట్టురట్టయింది. రూ.51 లక్షల బంగారాన్ని స్వాధీనం చేసుకొని ప్రయాణికుడిని అరెస్టు చేశారు.

మరో ప్రయాణికుడి సామగ్రిలో 233 గ్రాములు..: హైదరాబాద్‌కు చెందిన మరో వ్యక్తి దుబాయ్‌ నుంచి  ఇండిగో ఎయిర్‌లైన్స్‌ విమానంలో తీసుకొచ్చిన 233 గ్రాముల బంగారాన్ని విమానాశ్రయం అధికారులు స్వాధీనం చేసుకున్నారు.  రెండు బంగారం బిస్కెట్లను ఫిష్‌ ఆయిల్‌ టిన్‌లో రహస్యంగా పెట్టుకొని తరలిస్తున్నాడు. రూ.14 లక్షల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకుని ప్రయాణికుడిని అరెస్టు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని