Harish rao: ఫెర్టిలిటీ కేంద్రాల ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలి: హరీశ్‌రావు

పేదలకూ సంతాన సాఫల్య చికిత్సలను ఉచితంగా అందించే లక్ష్యంతో సర్కారు తలపెట్టిన ఫెర్టిలిటీ కేంద్రాల ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని వైద్యారోగ్య  శాఖ మంత్రి హరీశ్ రావు అధికారులను ఆదేశించారు.

Published : 07 Jun 2023 22:25 IST

హైదరాబాద్: పేదలకూ సంతాన సాఫల్య చికిత్సలను ఉచితంగా అందించే లక్ష్యంతో సర్కారు తలపెట్టిన ఫెర్టిలిటీ కేంద్రాల ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని వైద్యారోగ్య  శాఖ మంత్రి హరీశ్ రావు అధికారులను ఆదేశించారు. టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ (TSMSIDC), ఎన్‌హెచ్‌ఎం (NHM) కార్యక్రమాల నిర్వహణపై వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులు, జిల్లాల డీఎంహెచ్‌వోలు, ఆసుపత్రుల సూపరింటెండెంట్లతో మంత్రి నెలవారీ సమీక్ష నిర్వహించారు.

టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ పరిధిలో పురోగతిలో ఉన్న పెండింగ్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. రూ.35 కోట్లతో గాంధీ ఆసుపత్రిలో ఏర్పాటు చేయనున్న అవయవ మార్పిడి కేంద్రం, గాంధీ, ఎంజీఎం, పేట్లబుర్జు ఆసుపత్రుల్లో ఏర్పాటు చేస్తున్న ఫెర్టిలిటీ సెంటర్ పనుల్లో వేగం పెంచాలన్నారు. సెంట్రల్ మెడిసిన్ స్టోర్స్, నర్సింగ్ కాలేజీల నిర్మాణాలు పూర్తిచేయటం సహా ఇప్పటికే పూర్తైన బస్తీ దవాఖానాలు, తెలంగాణ డయాగ్నొస్టిక్ హబ్స్‌ని ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. అనవసర సి-సెక్షన్లు తగ్గించేందుకు సిబ్బంది కృషి చేయాలని.. అవసరమైతే మిడ్ వైఫ్ స్టాఫ్ నర్స్‌ల సేవలు పూర్తిస్థాయిలో వినియోగించుకొని సాధారణ ప్రసవాలు పెంచాలని హరీశ్‌రావు ఆదేశించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని