logo

Hyderabad: వాహ్‌... చల్లని సేవల ‘సీఎం క్యాబ్‌’

ప్రయాణికులు వేసవి తాపానికి గురి కాకూడదని ఓ ఆటోడ్రైవర్‌ తన వాహనంపై ఏకంగా నారు పెంచుతూ చల్లగా ఉంచుతున్నారు.

Updated : 27 Mar 2024 07:25 IST

న్యూస్‌టుడే, హైదరాబాద్‌: ప్రయాణికులు వేసవి తాపానికి గురి కాకూడదని ఓ ఆటోడ్రైవర్‌ తన వాహనంపై ఏకంగా నారు పెంచుతూ చల్లగా ఉంచుతున్నారు. హైదరాబాద్‌ నగరంలో తిరుగుతున్న ఈ ఆటో.. పై కప్పున నారుతో ప్రయాణికులను ఆకర్షిస్తోంది. అల్వాల్‌కు చెందిన ఓం ప్రకాశ్‌ తన ఆటోపై గోనెసంచులు వేసి వరి విత్తనాలు వేశారు. నారు మొలకెత్తాక రోజూ నీళ్లు చల్లుతూ ఆటోలోపల చల్లగా ఉండేలా జాగ్రత్తపడుతూ ప్రయాణీకుల ఆదరణ చూరగొంటున్నారు. సీఎం క్యాబ్‌ (కామన్‌ మ్యాన్‌ క్యాబ్‌) పేరును ఆటో వెనుక రాసుకుని తిరుగుతూ.. అలా చల్లని సేవలను అందిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని