logo

శంషాబాద్‌లో చిక్కిన చిరుత అమ్రాబాద్‌కు తరలింపు

శంషాబాద్‌ విమానాశ్రయంలో ట్రాప్‌ బోనులో చిక్కిన మగ చిరుతను శనివారం హైదరాబాద్‌ నెహ్రూ జూపార్కు అధికారులు అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వు ఫారెస్టులోకి వదలి పెట్టారు.

Published : 05 May 2024 03:17 IST

చార్మినార్‌, న్యూస్‌టుడే: శంషాబాద్‌ విమానాశ్రయంలో ట్రాప్‌ బోనులో చిక్కిన మగ చిరుతను శనివారం హైదరాబాద్‌ నెహ్రూ జూపార్కు అధికారులు అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వు ఫారెస్టులోకి వదలి పెట్టారు.  ఆరోగ్యంగా ఉన్న చిరుతను జూపార్కు క్యూరేటర్‌ డా.సునిల్‌ ఎస్‌.హిరేమత్‌ ఆధ్వర్యంలో జూ వెటర్నరీ అధికారులు ప్రత్యేక వ్యానులోని బోనులో అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వు ఫారెస్టుకు తరలించి అక్కడి అడవిలో వదిలి పెట్టారు. బోను తెరుచుకోగానే అడవిలోకి పరుగు తీసిందని అధికారులు పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని