logo

ఒకే పేరుతో ఇద్దరు అభ్యర్థులు

ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు గుర్తులే కాదు.. అప్పుడప్పుడు పేర్లు కంగారు పెడుతుంటాయి. ఒకే పేరుతో ఇద్దరు పోటీ చేసేటప్పుడు మరింత ఎక్కువ ఆందోళన ఉంటుంది.

Published : 05 May 2024 03:18 IST

పేరే కాదు.. గుర్తును గుర్తుంచుకోవాల్సిందే

ఈనాడు, హైదరాబాద్‌: ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు గుర్తులే కాదు.. అప్పుడప్పుడు పేర్లు కంగారు పెడుతుంటాయి. ఒకే పేరుతో ఇద్దరు పోటీ చేసేటప్పుడు మరింత ఎక్కువ ఆందోళన ఉంటుంది.  ఇలాంటి ఇబ్బందికర పరిస్థితినే చేవెళ్ల నుంచి భాజపా తరుఫున పోటీ చేస్తున్న కొండా విశ్వేశ్వరరెడ్డి ఎదుర్కొంటున్నారు. దీనిపై ఆయన కోర్టును, ఎన్నికల కమిషన్‌ను ఆశ్రయించారు.

చేవెళ్ల నియోజకవర్గం నుంచి 43 మంది బరిలో ఉన్నారు. గుర్తింపు పొందిన పార్టీలు, నమోదైన పార్టీలు, స్వతంత్రులకు ఎన్నికల అధికారులు వరస సంఖ్య, ఎన్నికల గుర్తును కేటాయించారు. కొండా విశ్వేశ్వర్‌రెడ్డికి 2 నంబరు కేటాయించగా ఆయనది కమలం గుర్తు. ఆలిండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ పార్టీ తరుఫున పోటీ చేస్తున్న అభ్యర్థి పేరు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి. ఆయనకు 4 నంబరు ఇవ్వగా గుర్తు సింహం. ఇలా పక్కపక్కనే ఒకే పేరు, ఇంటిపేరుతో ఉన్న ఇద్దరు అభ్యర్థులు ఉంటే ఓటర్లు పొరపడే అవకాశం ఉంటుందని అంటున్నారు. కాబట్టి పేరొక్కటే గుర్తుంటే సరిపోదు గుర్తు సైతం గుర్తుంచుకోవాలని అంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని