logo

కష్టసుఖాలు ఉన్నప్పుడే జీవితం పరిపూర్ణం

కష్టాలు, సుఖాలున్నప్పుడే జీవితం పరిపూర్ణం అవుతుందని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బి.శేషశయనరెడ్డి అన్నారు.

Updated : 08 May 2024 05:54 IST

సుద్దాల అశోక్‌తేజ, పి.రాజేంద్రకుమార్‌లకు పురస్కారాలు ప్రదానం చేసిన జస్టిస్‌
శేషశయనరెడ్డి, చిత్రంలో కొండలరావు, లక్ష్మీనారాయణ, రామారావు, హరికృష్ణ

రవీంద్రభారతి: కష్టాలు, సుఖాలున్నప్పుడే జీవితం పరిపూర్ణం అవుతుందని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బి.శేషశయనరెడ్డి అన్నారు. మంగళవారం రవీంద్రభారతిలో యువకళావాహిని నిర్వహణలో  సారిపల్లి కొండలరావు ఆధ్వర్యంలో ‘అక్కినేని శతజయంతి, ఆత్రేయ 102వ జయంతి సందర్భంగా ‘అక్కినేని ఆత్రేయ స్మారక’ పురస్కారాల ప్రదానోత్సవం నిర్వహించారు.   ఆయన మాట్లాడుతూ.. ఏ రంగంలో రాణించాలన్నా గట్టిగా ప్రయత్నిస్తే విజయం సాధిస్తామన్నారు. సినీ గేయ రచయిత సుద్దాల అశోక్‌ తేజ, రచయిత డా.పి.రాజేంద్రకుమార్‌లకు పురస్కారాలు ప్రదానం చేశారు. భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ ప్రారంభోపన్యాసం చేయగా, సినీ విశ్లేషకుడు ఎస్‌.వి.రామారావు సమన్వయకర్తగా వ్యవహరించారు. నిర్వాహకులు లంక లక్ష్మీనారాయణ స్వాగతం పలికారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు