logo

ప్రశాంత ఎన్నికలకు పటిష్ఠ చర్యలు

లోక్‌సభ ఎన్నికల్లో అవాంఛనీయ ఘటనలకు ఆస్కారం లేకుండా పోలింగ్‌ నుంచి ఓట్ల లెక్కింపు వరకు  పటిష్ఠ బందోబస్తు చేస్తున్నట్లు రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ తరుణ్‌జోషి వెల్లడించారు. 5 లోక్‌సభ నియోజకవర్గాల్లో విస్తరించిన కమిషనరేట్‌ పరిధిలో తీసుకుంటున్న చర్యలపై ‘ఈనాడు’ ముఖాముఖిలో మాట్లాడారు.

Published : 08 May 2024 04:05 IST

బందోబస్తు విధుల్లో 5 వేల మంది పోలీసులు
12 కంపెనీల కేంద్ర బలగాల మోహరింపు
‘ఈనాడు’ ముఖాముఖిలో రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ తరుణ్‌జోషి వెల్లడి

ఈనాడు- హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికల్లో అవాంఛనీయ ఘటనలకు ఆస్కారం లేకుండా పోలింగ్‌ నుంచి ఓట్ల లెక్కింపు వరకు  పటిష్ఠ బందోబస్తు చేస్తున్నట్లు రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ తరుణ్‌జోషి వెల్లడించారు. 5 లోక్‌సభ నియోజకవర్గాల్లో విస్తరించిన కమిషనరేట్‌ పరిధిలో తీసుకుంటున్న చర్యలపై ‘ఈనాడు’ ముఖాముఖిలో మాట్లాడారు.

ప్రశ్న: ఎన్నికల్లో భద్రతకు తీసుకున్న చర్యలేంటి?
జవాబు :
మల్కాజిగిరి, భువనగిరి నియోజకవర్గాలు ఎక్కువగా..చేవెళ్ల, నాగర్‌కర్నూలు, హైదరాబాద్‌ నియోజకవర్గాలు పాక్షికంగా కమిషనరేట్‌ పరిధిలోకి వస్తాయి.1,590 ప్రాంతాల్లో 3,396 పోలింగ్‌ కేంద్రాలు ఉండగా వాటిలో 533 సమస్యాత్మకమైనవి. 5వేల మంది పోలీసులు, 12 కంపెనీల కేంద్ర బలగాలు, శిక్షణలోని కానిస్టేబుళ్లు, ఎస్సైలను బందోబస్తులో ఉంటారు. ఎక్కడకైనా క్షణాల్లో చేరుకునేలా వ్యూహం రూపొందించాం. 

ప్ర: ఘర్షణలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలేంటి?
జ:
84 శాతం సాధారణ పోలింగ్‌ కేంద్రాలున్నాయి.పోలింగ్‌ రోజు పెట్రోలింగ్‌, రూట్‌ మొబైల్స్‌, క్విక్‌ రెస్పాన్స్‌ టీమ్‌, స్పెషల్‌ స్ట్రైకింగ్‌ ఫోర్స్‌, బ్లూకోల్ట్స్‌ విధుల్లో ఉంటారు. ప్రత్యేక పికెట్లు ఉంటాయి.

ప్ర: డీఆర్‌సీ కేంద్రాలు, ఈవీఎంల తరలింపు మార్గాల ఖరారు, పోలీసులకు శిక్షణ పూర్తయిందా ?
జ:
8 డీఆర్‌సీ కేంద్రాలు, 3ఓట్ల లెక్కింపు కేంద్రాలున్నాయి. ఈవీఎంలతరలింపునకు రూట్‌మ్యాప్‌ ఖరారైంది. 20 శిక్షణ సదస్సులు నిర్వహించాం.62 చోట్ల ఫ్లాగ్‌ మార్చ్‌ చేశాం.అక్రమ నగదు, మద్యం, ఉచితాల తరలింపును అడ్డుకుంటున్నాం.

ప్ర: రౌడీషీటర్ల బైండోవర్‌, ఆయుధాల స్వాధీనం పూర్తయిందా?
జ:
లైసెన్స్‌డ్‌ ఆయుధాల స్వాధీనం పూర్తయింది. మొత్తం 1,114 లైసెన్సులున్నాయి.బ్యాంకుల భద్రతా సిబ్బంది, నగదు తరలించే 252 లైసెన్సులకు మినహాయింపులు ఉన్నాయి. రౌడీషీటర్లు, పాత నేరస్థులు, గతంలో ఎన్నికల నేరాలకు పాల్పడ్డవారు 4,780 మందిని బైండోవర్‌ చేశాం.

ప్ర: సోషల్‌ మీడియాలో తప్పుడు పోస్టుల కట్టడి ఎలా?
జ:
ఇలాంటి వాటిపై నిఘా ఉంచుతాం. ఖాతాదారులు తమకు వచ్చే వీడియోలు, పోస్టులను తనిఖీ చేయకుండా ఇతరులకు షేర్‌ చేయొద్దు. కంటెంట్‌పై అనుమానాలుంటే పోలీసులను సంప్రదించాలి. నకిలీవని తెలిసీ వైరల్‌ చేస్తే  చర్యలు తీసుకుంటాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు