logo
Updated : 02/12/2021 19:54 IST

వైభవంగా ప్రాచీన చర్చి తిరుణాల

కలసపాడు: మండల కేంద్రంలోని సగిలేరు ఒడ్డున ఉన్న ప్రాచీన పరిపేతురు-పరిపౌలు చర్చి 134వ తిరుణాల గురువారం వైభవంగా నిర్వహించారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచే కాక, ఇతర రాష్ట్రాల నుంచి పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చి ప్రాచీన చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. తొలుత నంద్యాల డయాసిస్‌ బిషఫ్‌ పుష్పలలిత ఆధ్వర్యంలో పలువురు ప్రముఖులను ఊరేగించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పిల్లలు, స్ర్తీల మైత్రి సాంస్కృతిక కార్యక్రమాలు, సుదర్శన్‌ బృందం చెక్కభజనలు, క్రైస్తవ నాటకం భక్తులను అలరించాయి. ఉపాధ్యాయుడు ప్రవీణ్‌ 1200 మంది భక్తులకు ఉచితంగా మాస్కులు అందజేశారు. మైదుకూరు డీఎస్పీ విజయ్‌కుమార్‌, సీఐ మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో 140 మంది పోలీసులు ప్రత్యేక బందోబస్తు నిర్వహించారు.

Read latest Kadapa News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని