logo

నిత్యావసర ధరలు తగ్గించాలని ఆందోళన

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన నిత్యావసర ధరలను వెంటనే తగ్గించాలని కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ఆదివారం పట్టణంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ...రోజు రోజుకు నిత్యావసర ధరలు పెరుగుతుండటంతో సామాన్యుల జీవనం

Published : 17 Jan 2022 04:30 IST


ప్లకార్డులను మంటల్లో కాల్చుతున్న కాంగ్రెస్‌ నాయకులు

రాయచోటి గ్రామీణ, న్యూస్‌టుడే: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన నిత్యావసర ధరలను వెంటనే తగ్గించాలని కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ఆదివారం పట్టణంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ...రోజు రోజుకు నిత్యావసర ధరలు పెరుగుతుండటంతో సామాన్యుల జీవనం కష్టంగా ఉందన్నారు. డీజిల్‌, పెట్రోలు ధరలు ఆకాశన్నంటుతున్నాయన్నారు. అనంతరం ప్లకార్డులను మంటల్లో వేసి నిరసన తెలిపారు. కార్యక్రమంలో ఆపార్టీ నాయకులు అల్లాబకాస్‌ డీసీసీ మైనార్టీ ఉపాధ్యక్షుడు మన్సూర్‌ అలీఖాన్‌, యహియాబాషా, నసీం తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని