logo

నేరాల కట్టడికి నిఘా పెంచాలి : ఎస్పీ

జిల్లాలో నేరాల కట్టడికి నిఘా పెంచాలని ఎస్పీ అన్బురాజన్‌ పోలీసులను ఆదేశించారు. పెండింగ్‌ కేసులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని పెన్నార్‌ సమావేశం మందిరంలో శనివారం ఎస్పీ ఆధ్వర్యంలో డీఎస్పీ, సీఐలు, ఎస్సైలతో నేరాలపై

Published : 22 May 2022 04:06 IST


 మాట్లాడుతున్న ఎస్పీ అన్బురాజన్, చిత్రంలో ఎస్‌ఈబీ అదనపు
ఎస్పీ నీలం పూజిత, ఏఆర్‌ అదనపు ఎస్పీ మహేష్‌కుమార్‌

కడప నేరవార్తలు, న్యూస్‌టుడే : జిల్లాలో నేరాల కట్టడికి నిఘా పెంచాలని ఎస్పీ అన్బురాజన్‌ పోలీసులను ఆదేశించారు. పెండింగ్‌ కేసులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని పెన్నార్‌ సమావేశం మందిరంలో శనివారం ఎస్పీ ఆధ్వర్యంలో డీఎస్పీ, సీఐలు, ఎస్సైలతో నేరాలపై సమీక్ష నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ.. తీవ్రమైన నేరాల్లో త్వరితగతిన దర్యాప్తు పూర్తిచేసి ఛార్జిషీటు దాఖలు చేయాలన్నారు. జిల్లాలో తరచూ రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో ప్రమాదనివారణ చర్యలు చేపట్టాలని, అవసరమైతే వాహనదారులను అప్రమత్తం చేస్తూ సూచిక బోర్డులు ఏర్పాటు చేసేలా చూడాలన్నారు. మహిళలపై జరుగుతున్న వివిధ రకాల నేరాలపై దర్యాప్తు వేగవంతం చేయాలని పేర్కొన్నారు. పోక్సో, మహిళలపై జరిగిన నేరాలపై నిర్ణీత సమయంలో ఛార్జిషీటు దాఖలు చేయాలని ఆదేశించారు. మహిళలు, బాలికల అదృశ్య కేసుల్లో సమగ్ర విచారణ జరిపి అదృశ్యమైన వారి ఆచూకీ తెలుసుకోవాలన్నారు. ఎస్‌ఈబీ అధికారులతో కలిసి నాటుసారా స్థావరాలపై సంయుక్తంగా దాడులు నిర్వహించాలని చెప్పారు. ఎస్‌హెచ్‌ఆర్‌సీ, ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఫిర్యాదులపై తక్షణం స్పందించాలని ఆదేశించారు. అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోవద్దని, విధుల్లో తేడాలొస్తే ఉపేక్షించే ప్రసక్తే లేదని హెచ్చరించారు. అనంతరం ఒక్కో డివిజన్‌ పరిధిలో నేరాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో ఎస్‌ఈబీ అదనపు ఎస్పీ నీలం పూజిత, ఏఆర్‌ అదనపు ఎస్పీ మహేష్‌కుమార్‌ పాల్గొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని